Moto G 5G 2025: మోటోరోలా నుంచి కొత్త ఫోన్‌ వస్తోంది.. పేరుకే బడ్జెట్‌ తక్కువ, ఫీచర్స్‌ మాత్రం..

Moto G 5G 2025
x

Moto G 5G 2025: మోటోరోలా నుంచి కొత్త ఫోన్‌ వస్తోంది.. పేరుకే బడ్జెట్‌ తక్కువ, ఫీచర్స్‌ మాత్రం..

Highlights

Moto G 5G 2025: మోటో జీ 5జీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ పేరుతో ఇప్పటికే ఒక ఫోన్‌ ఉండగా తాజాగా దీనికి లేటెస్ట్‌ వెర్షన్‌ మోటో జీ 5జీ 2025 ఎడిషన్‌ను తీసుకొస్తోంది.

Moto G 5G 2025: తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ ఫోన్‌లను లాంచ్‌ చేయడంలో ముందు వరుసలో ఉంటోంది ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూ మార్కెట్లోకి ఫోన్‌లను తీసుకొస్తున్న ఈ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం తాజాగా మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాదిలో మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

మోటో జీ 5జీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ పేరుతో ఇప్పటికే ఒక ఫోన్‌ ఉండగా తాజాగా దీనికి లేటెస్ట్‌ వెర్షన్‌ మోటో జీ 5జీ 2025 ఎడిషన్‌ను తీసుకొస్తోంది. ఇందులో అప్‌గ్రేడెడ్‌ ఫీచర్లను అందించనున్నారు. ఇప్పటి వరకు కంపెనీ ఈ ఫోన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ నెట్టింట ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని లీక్స్‌ వైరల్‌ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత ఉండనుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మోటో జీ 5జీ ఫోన్‌లో రెక్టాంగులర్‌ మాడ్యుల్‌తో కూడిన రెయిర్‌ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నారని తెలుస్తోంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 1 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేయనుందని తెలుస్తోంది.

సెక్యూరిటీ కోసం ఇందులో సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను ఇవ్వనున్నారు. 3.5 ఎంఎం హెడ్​ఫోన్​ జాక్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారని సమాచారం. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 18 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు. 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ని అందించనున్నట్లు తెలుస్తోంది. ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ ధర రూ. 15 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories