భారతదేశపు మొట్టమొదటి 5G స్మార్ట్‌ఫోన్ .. 100% మేడ్ ఇన్ ఇండియా..!

Mivi Company to Release Indias First 5G Smartphone 100% Made in India
x

భారతదేశపు మొట్టమొదటి 5G స్మార్ట్‌ఫోన్ .. 100% మేడ్ ఇన్ ఇండియా..!

Highlights

5G Smartphone: భారతదేశంలోనే తయారు చేసిన సరికొత్త 5జి స్మార్ట్‌ఫోన్ త్వరలో విడుదలకానుంది.

5G Smartphone: భారతదేశంలోనే తయారు చేసిన సరికొత్త 5జి స్మార్ట్‌ఫోన్ త్వరలో విడుదలకానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశపు మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా 5G స్మార్ట్‌ఫోన్. భారతదేశానికి చెందిన ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Mivi పూర్తిగా దేశంలోనే తయారు చేసి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు అసెంబ్లింగ్ మాత్రమే చేస్తాయి. స్మార్ట్‌ఫోన్‌లు ఇతర దేశాలలో తయారవుతాయి. దీంతో పాటు స్మార్ట్‌ఫోన్ భాగాలను బయటి నుంచి దిగుమతి చేసుకుంటారు.

అయితే భారతీయ ఎలక్ట్రానిక్ కంపెనీ Miviఫోన్ రూపకల్పన, అసెంబ్లింగ్, తయారీ విధానం మొత్తం భారతదేశంలోనే చేస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ గురించి ఎటువంటి సమాచారం లేదు. కానీ కంపెనీ ఈ బ్రాండ్‌ను సరసమైన ధరలో విడుదల చేసే అవకాశం ఉంది. వచ్చే ఒకటి లేదా రెండేళ్లలో కొత్త హ్యాండ్‌సెట్‌ని విడుదల చేయవచ్చు.

5G ఫోన్ ప్రయోజనాలు

5G ఫోన్‌తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఫోన్ అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే మీరు 5G కనెక్టివిటీని ఉపయోగించుకోగలుగుతారు. దీనివల్ల ఫోన్‌లో స్లో ఇంటర్నెట్ సమస్యను పరిష్కరించవచ్చు. కొన్ని సెకన్లలోనే ఫోటోలు లేదా వీడియోలని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అంతేకాదు అప్‌లోడ్ కూడా చేయవచ్చు. వీడియో లైవ్ స్ట్రీమింగ్ బఫరింగ్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఆటోమొబైల్, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాలు 5G సేవ నుంచి పెద్ద ప్రయోజనాలను పొందవచ్చు. 5G స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్న వినియోగదారులు అదనపు ఛార్జీలు లేకుండా హై స్పీడ్ ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories