Mini Sewing Machine: మినీ కుట్టు మిషన్.. కరెంటుతో పనిచేస్తుంది.. ధర రూ.1,676..!

Mini sewing machine available on Amazon for just Rs. 1,676
x

Mini Sewing Machine: మినీ కుట్టు మిషన్.. కరెంటుతో పనిచేస్తుంది.. ధర రూ.1,676..!

Highlights

Mini Sewing Machine: గ్రామీణ పట్టణ ప్రాంతాలతో పాటు పట్టనాలలో నివసించే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు కుట్టు మిషన్లు కుడుతూ జీవనోపాధిని పొందుతుంటారు.

Mini Sewing Machine: గ్రామీణ పట్టణ ప్రాంతాలతో పాటు పట్టనాలలో నివసించే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు కుట్టు మిషన్లు కుడుతూ జీవనోపాధిని పొందుతుంటారు. ఈ క్రమంలో సదరు కుట్టుమిషన్లు రిపేరుకు వస్తే వాటిని బాగు చేయించేందుకు ఆందోళన చెందుతుంటారు. ఈక్రమంలో పలు కంపెనీలు మినీ కుట్టు మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. మామూలుగా కట్టుమిషన్ అనగానే కనీసంలో కనీసం రూ.15వేలైనా ఉంటుందని భావిస్తుంటారు. కానీ రోజులు మారాయి. ఇప్పుడు మినీ కుట్టు మిషన్లు అందుబాటులోకి వచ్చేశాయి. వాటిని కొన్న మధ్యతరగతి కుటుంబాలు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. అలాంటి ఎలక్ట్రిక్ కుట్టు మిషన్ వివరాలు ఇక్కడ చూడండి.. నచ్చితే కనుక కొనేయండి.

దీన్ని Akiara కంపెనీ తయారుచేసింది. కుట్టుకోవడం అనే పనిని తేలిగ్గా పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎలక్ట్రిక్ కుట్టు మిషన్‌ని తయారుచేసినట్లు సదరు కంపెనీ తెలిపింది. ఈ కుట్టు మిషన్‌తో పాటు చిన్న టేబుల్ కూడా ఇస్తున్నారు. దీంతో చేతితో చక్కగా కుట్టేసుకోవచ్చు. ఫుట్ పెడల్ ఉంది. ఛార్జింగ్ కోసం అడాప్టర్ ఇస్తున్నారు. వైట్ కలర్ లో వస్తుంది. 2 కిట్‌లు కూడా ఇస్తున్నారు. ఈ కుట్టుమిషన్ AC/DC పవర్ సప్లైతో పనిచేస్తుంది. వైర్‌లెస్ బ్యాటరీలతోనూ ఈ మిషన్ పనిచేస్తుంది. బటన్ నొక్కితే ఆన్ అవుతుంది. ఫుట్ పెడల్ కూడా ఉంది. దీంతో ఈజీగా కుట్టుకోవచ్చు. దీనితో మీకు 1 ఎక్స్‌టెన్షన్ టేబుల్, 4 మెటల్ బొబ్బిన్స్, 1 ఫుట్ పెడల్, 1 సూది, 1 దారం ఇస్తున్నారు.

ఇందులో ఒకేసారి రెండు దారాలతో అల్లుకోవచ్చు, అలాగే.. రెండు రకాల స్పీడ్ మోడ్ లతో కుట్టుకోవచ్చు. ఇది ఆటోమేటిక్ విండింగ్ ఫంక్షన్ ఉంటుంది. హై క్వాలిటీ కుట్టు ఇస్తుంది. లో, హై స్పీడ్ కుట్టు వల్ల కావాల్సిన స్పీడ్ పెట్టుకోవచ్చు. ఎవరికి నచ్చినట్లు వారు కుట్టును ఎంచుకోవచ్చు. దీని ద్వారా స్లీవ్స్, ట్రౌజర్స్ వంటివి కుట్టుకోవడానికి కూడా ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది.. ఇందులో లైట్ కూడా బిల్ట్‌ ఇన్‌గా ఉంది. కుట్టేటప్పుడు లైట్ కూడా వేసుకోవచ్చు. ఇది యూజర్ ఫ్రెండ్లీ టైలరింగ్ మెషిన్ అన్నమాట. ఏదైనా సమస్య వస్తే, ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. దీని అసలు ధర రూ.2,499 కాగా.. అమెజాన్‌లో దీనిపై 33 శాతం డిస్కౌంట్ తో.. రూ.1,676కి కొనుగోలు చేయవచ్చు. దీన్ని మీరు EMIలో రూ.82కే పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories