ఏడు గంటలు..ఏడు బిలియన్ డాలర్ల నష్టం.. మార్క్‌ జుకర్‌బర్గ్‌కు తీవ్రనష్టం

Mark Zuckerberg Loses USD 7 Billion
x

ఏడు గంటలు..ఏడు బిలియన్ డాలర్ల నష్టం.. మార్క్‌ జుకర్‌బర్గ్‌కు తీవ్రనష్టం

Highlights

Mark Zuckerberg: ప్రపంచ వ్యాప్తంగా నిన్న రాత్రి 9 గంటల నుంచి దాదాపు 7 గంటల పాటు స్తంభించిన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు పునరుద్ధరించబడ్డాయి.

Mark Zuckerberg: ప్రపంచ వ్యాప్తంగా నిన్న రాత్రి 9 గంటల నుంచి దాదాపు 7 గంటల పాటు స్తంభించిన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు పునరుద్ధరించబడ్డాయి. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల తర్వాత సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని టెక్నికల్‌ ఇష్యూస్‌ వల్లే సేవలు నిలిచిపోయినట్టు ఫేస్‌బుక్‌ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. నిన్న రాత్రి భారత్‌తో పాటు వివిధ దేశాల్లో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు స్తంభించాయి. మెసేజ్‌లు వెళ్లకపోవడం, రాకపోవడంతో యూజర్లు తీవ్ర ఇబ్బుందులు పడ్డారు.

ఫేస్‌బుక్‌, దాని అనుబంధ యాప్‌ సర్వీస్‌లు ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ సేవల విఘాతం వల్ల ఫేస్‌బుక్ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌కు కోలుకోని నష్టాన్ని మిగిల్చాయి. కేవలం ఏడు గంటలపాటు సేవలు ఆగిపోవడంతో సుమారు 7 బిలియన్‌ డాలర్లు అంటే ఇండియన్‌ కరెన్సీ ప్రకారం దాదాపు 50వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఈ దెబ్బతో అపర కుబేరుల జాబితా నుంచి జుకర్‌బర్గ్ స్థానం కిందకు పడిపోయింది.

ఫేస్‌బుక్‌ స్థాపించినప్పటి నుంచి ప్రపంచం మొత్తం మీద ఏడు గంటల పాటు సర్వీసులు నిలిచిపోవడం ఇదే మొదటిసారి. ఈ ఎఫెక్ట్‌తో జుకర్‌బర్గ్‌ ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం 120.9 బిలియన్ డాలర్లతో బిల్‌గేట్స్‌ తర్వాతి స్థానంలో నిలిచాడు మార్క్ జుకర్‌బర్గ్.


Show Full Article
Print Article
Next Story
More Stories