Voter ID Card: ఓటర్‌ ఐడీ కార్డ్‌ పోయిందా.. ఇలా డూప్లికేట్ కాపీని పొందండి..!

Lost Voter ID Card Get Duplicate Copy Here Know Process
x

Voter ID Card: ఓటర్‌ ఐడీ కార్డ్‌ పోయిందా.. ఇలా డూప్లికేట్ కాపీని పొందండి..!

Highlights

Voter ID Card: ఒక భారతీయుడికి ఉండాల్సిన ముఖ్యమైన పత్రాలలో ఓటర్‌ ఐడీ కార్డ్‌ ఒకటి. దీని ద్వారానే మనం ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులం అవుతాం.

Voter ID Card: ఒక భారతీయుడికి ఉండాల్సిన ముఖ్యమైన పత్రాలలో ఓటర్‌ ఐడీ కార్డ్‌ ఒకటి. దీని ద్వారానే మనం ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులం అవుతాం. దీనిని ఎన్నికల సంఘం జారీ చేస్తుంది. ఇది గుర్తింపుకార్డుగా కూడా పనిచేస్తుంది. ప్రభుత్వ పథకాలు పొందడానికి, బ్యాంకు అకౌంట్‌ ఓపెన్‌ చేయడానికి, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌ , పాస్‌పోర్ట్‌ పొందడానికి ఇంకా చాలా పనులకు ఉపయోగపడుతుంది. అయితే ఓటర్‌ ఐడీ కార్డ్‌ పోగొట్టుకున్నా చింతించాల్సిన అవసరం లేదు. సులువుగా డూప్లికేట్‌ కాపీని పొందవచ్చు. దాని ప్రాసెస్‌ గురించి ఈ రోజు తెలుసుకుందాం.

డూప్లికేట్ ఓటర్ ఐడీ ఆన్‌లైన్ ప్రక్రియ

1. ముందుగా భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

2. "ఆన్‌లైన్ సర్వీసెస్" పై క్లిక్ చేయాలి.

3. "ఓటర్ ఐడీ కార్డ్ కోసం అప్లై" పై క్లిక్ చేయాలి.

4. మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.

5. మీ ఓటరు నమోదు సంఖ్య (VID)ని ఎంటర్‌ చేయాలి.

6. మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.

7. మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

8. OTPని ఎంటర్‌ చేయాలి.

9. మీ అప్లికేషన్‌ ఫారమ్‌ నింపాలి.

10.అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

11. తర్వాత అప్లికేషన్‌ ఫారమ్‌ను సమర్పించాలి.

అవసరమైన పత్రాలు

1. పాస్‌పోర్ట్ సైజు ఫొటో

2. ఐడెంటిటీ కార్డ్ కాపీ (ఉదా.. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్)

3. అడ్రస్ ప్రూఫ్ (ఉదా.. విద్యుత్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్)

4. ఓటర్ ఐడీ కార్డ్ పోయినట్లయితే FIR కాపీ

5. మీ అప్లికేషన్‌ స్టేటస్‌ను తెలుసుకోవడానికి భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

6. డూప్లికేట్ ఓటరు గుర్తింపు కార్డు కోసం ఎటువంటి రుసుము లేదు.

7. డూప్లికేట్ ఓటరు గుర్తింపు కార్డు 15 నుంచి 20 రోజుల్లో జారీ అవుతుంది.

ఈ విషయాలపై శ్రద్ధ వహించండి

1. మీ ఓటరు ఐడీ కార్డ్ పోయినా లేదా ఎవరైనా దొంగిలించినా FIR ఫైల్ చేయండి.

2. అప్లికేషన్‌ ఫారమ్‌ నింపేటప్పుడు అవసరమైన సమాచారాన్ని పూరించండి.

3. అవసరమైన పత్రాలు స్పష్టంగా, నిస్సందేహంగా ఉండాలని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories