Lenovo Legion Tab: లెనోవో నుంచి సరికొత్త ట్యాబ్‌.. కళ్లు చెదిరే ఫీచర్స్‌

Lenovo Legion Tab
x

Lenovo Legion Tab

Highlights

Lenovo Legion Tab: లెనోవో లిజియన్‌ ట్యాబ్ (Lenovo Legion Tab) ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 8.8 ఇంచెస్‌తో కూడిన క్యూహెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందిస్తున్నారు.

Lenovo Legion Tab: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లతో సమానంగా ట్యాబ్‌లకు కూడా ఆదరణ పెరుగుతోంది. కరోనా పరిస్థితుల తర్వాత ట్యాబ్స్‌ ఉపయోగం మరింత పెరిగింది. దీంతో కంపెనీలు సైతం సరికొత్త ఫీచర్లతో కూడిన ట్యాబ్‌లు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం లెనోవో (Lenovo) కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేసింది. లెనోవో లిజియన్‌ (Lenovo Legion)పేరుతో కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేశారు. ఇంతకీ ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

లెనోవో లిజియన్‌ ట్యాబ్ (Lenovo Legion Tab) ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 8.8 ఇంచెస్‌తో కూడిన క్యూహెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. దీంతో ఈ స్క్రీన్‌ను సన్‌ లైట్‌లోనూ స్పష్టం చూసే వీలు ఉటుంది. ఇక గేమింగ్‌ లవర్స్‌ కోసం ఈ ట్యాబ్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ట్యాబ్‌ బరువు 350 గ్రాములు, 7.6 మి.మి థిక్‌నెస్‌తో తీసుకొచ్చారు. ఇక గేమ్స్‌ ప్లే చేసే సమయంలో ఎలాంటి అవంతరం లేకుండా ఉండేందుకు స్నాప్‌డ్రాగన్ 8+ జెన్‌ 1 4ఎన్‌ఎం వంటి పవర్‌ పుల్ ప్రాసెసర్‌ను అందించారు.

ఇక లెనోవో లిజియన్‌ ట్యాబ్‌ను 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే ఈ ట్యాబ్‌లో 45 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6550 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇందులో డిస్‌ప్లే పోర్ట్ 1.4 సపోర్ట్‌, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌ను అందించారు. ఇక ఈ ట్యాబ్‌లో ప్రత్యేకంగా బీస్ట్ మోడ్, బ్యాలెన్స్‌డ్ మోడ్, ఎనర్జీ సేవింగ్ మోడ్ వంటి ఫీచర్లను అందించారు. స్టార్మ్ గ్రే కలర్‌లో తీసుకొచ్చిన ఈ ట్యాబ్‌ ర రూ. 39,999గా నిర్ణయించారు. కంపెనీ అధాకారిక వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్టు 15వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories