Lenovo Yoga Pro 7i: ఈ ల్యాప్‌టాప్‌ ధర అక్షరాల రూ. లక్షన్నర.. ప్రత్యేకతలు ఏంటంటే..!

Lenovo launches new laptop in india Lenovo yoga pro 7i features and price details
x

 Lenovo yoga pro 7i: ఈ ల్యాప్‌టాప్‌ ధర అక్షరాల రూ. లక్షన్నర.. ప్రత్యేకతలు ఏంటంటే

Highlights

Lenovo yoga pro 7i: ప్రస్తుతం మార్కెట్‌లో ప్రీమియం ల్యాప్‌టాప్‌ల హవా కొనసాగుతోంది.

Lenovo yoga pro 7i: ప్రస్తుతం మార్కెట్‌లో ప్రీమియం ల్యాప్‌టాప్‌ల హవా కొనసాగుతోంది. మిడ్ రేంట్ బడ్జెట్‌లో ల్యాప్‌టాప్‌ తీసుకొచ్చిన కంపెనీలు సైతం యూజర్ల అవసరాలకు అనుగుణంగా ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని ల్యాప్‌టాప్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం లెనోవో భారత మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది.

యోగో ప్రో 7ఐ పేరుతో ఈ కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేశారు. ఇప్పటికే గ్లోబల్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ను కంపెనీ తాజాగా భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. మల్టీ టాస్కింగ్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌ కోసం ప్రత్యేకంగా ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చారు. ఈ ల్యాప్‌ టాప్‌ ధర రూ. 1.5 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా 7 ప్రాసెసర్‌, ఎన్విడియా జీఈఫోర్స్‌ ఆర్‌టీఎక్స్ 4050 జీపీయూని అందించారు గేమింగ్ లవర్స్‌కి ఇది మంచి ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.

ఇక ఈ ల్యాప్‌టాప్‌లో 14 ఇంచెస్‌తో కూడి ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 120Hz రీఫ్రెష్‌ రేటు, డాల్బీ విజన్‌ కంటెంట్‌ సపోర్ట్‌,1800x2880 పిక్సెల్స్‌ రిజల్యూజన్‌ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఈ ల్యాప్‌టాప్‌లో హెచ్‌డీఆర్‌ కలర్‌ ప్రొడక్షన్‌ కోసం VESA డిస్‌ప్లేహెచ్‌డీఆర్‌ ట్రూ బ్లాక్‌ 500 సర్టిఫికేషన్‌ను అందించారు. అల్యూమినియం ఛాసిస్‌, బ్యాక్‌లిట్‌ కీబోర్డుతో ల్యాప్‌టాప్‌కు ప్రీమియం లుక్‌తో తీసుకొచ్చారు.

ఇక లెనోవో యోగా ప్రో 7ఐలో ప్రత్యేకంగా ‘కోపైలట్‌ కీ’ని అందించారు. 16 జీబీ డ్యూయల్‌ ఛానెల్ ర్యామ్‌, 1టీబీ వరకు స్టోరేజ్‌ కెపాసిటీతో తీసుకొచ్చారు. ఈ ల్యాప్‌టాప్‌ విండోస్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ హోమ్‌, స్టూడెంట్‌ 2021 ఎడిషన్ అందించారు. ఇక సౌండ్ విషయానికొస్తే.. డాల్బీ అట్మోస్‌ సపోర్ట్‌తో కూడిన క్వాడ్‌ స్పీకర్‌, హెచ్‌డీ ఆడియో చిప్‌ను ఇచ్చారు. దీంట్లో క్వాడ్‌ మైక్‌, డెప్త్‌ సెన్సర్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ ఐఆర్‌ కెమెరా ఉన్నాయి. యూజర్‌ అథెంటికేషన్‌ కోసం 'విండోస్‌ హాలో' ఫీచర్‌ను అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories