Lava Yuva 4: రూ. 7వేలలో స్టన్నింగ్‌ ఫీచర్స్‌.. మార్కెట్లోకి లావా కొత్త ఫోన్‌..!

Lava Launches New Smart Phone Lava Yuva 4 Features and Price Details
x

Lava Yuva 4: రూ. 7వేలలో స్టన్నింగ్‌ ఫీచర్స్‌.. మార్కెట్లోకి లావా కొత్త ఫోన్‌..!

Highlights

Lava Yuva 4: తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకురావడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ లావా.

Lava Yuva 4: తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకురావడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ లావా. తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొచ్చే లవా.. తాజాగా మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. లావా యువ 4 పేరుతో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రూ. 7వేలలో ఈ ఫోన్‌ను మంచి ఫీచర్లతో తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

లావా యువ4 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 10 వాట్స్ యూఎస్‌బీ టైప్‌ సీ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీ బ్యాటరీని అందించారు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌ వైట్‌, బ్లాక్‌, ఊదా మూడు కలర్స్‌లో తీసుకొచ్చారు. అలాగే ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేను అందించారు. ఫుల్‌హెచ్‌డీ+ రిజ్యూలస్‌, 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెట్‌ రేట్‌ స్క్రీన్‌ ఈ ఫోన్‌ సొంతం.

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ యూనిసోక్‌ టీ606 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్‌ను 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. సెక్యూరిటీ కోసం ఇందులో సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను అందించారు. ఆండ్రాయడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇంటర్నల్‌ మెమోరీని పెంచుకోవచ్చు. సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ప్రారంభ వేరియంట్‌ ధర రూ. 6,999గా నిర్ణయించారు. అన్ని రిటైల్‌ స్టోర్స్‌తో పాటు ఈ కామర్స్‌ సంస్థల్లో ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరలో మంచి ఫీచర్ల కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories