Lava Blaze X: రూ. 14 వేలలో ఇన్ని ఫీచర్లు ఏంటి భయ్యా.. కర్వ్‌డ్‌ డిస్‌ప్లేతో పాటు..

Lava Launched Budget 5G Phone Lava Blaze X Features and Price Details
x

Lava Blaze X: రూ. 14 వేలలో ఇన్ని ఫీచర్లు ఏంటి భయ్యా.. కర్వ్‌డ్‌ డిస్‌ప్లేతో పాటు..

Highlights

Lava Blaze X: స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.

Lava Blaze X: స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా రూ. 20 వేలలోపు కళ్లు చెదిరే ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం లావా మార్కెట్లోకి కొత్త బడ్జెట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. లావా బ్లేజ్‌ ఎక్స్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో కళ్లు చెదిరే ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలను ప్రారంభించారు. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానొకిస్తే ఇందులో.. 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ కర్వ్డ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్ సొంతం. దీంతో సన్‌లైట్‌లో కూడా ఈ స్క్రీన్‌ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే స్క్రీన్‌ వీక్షన క్వాలిటీ కోసం ఇందులో హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్‌తో తీసుకొచ్చారు. సెక్యూరిటీ కోసం ఇందులో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.

ఇక లావా బ్లేజ్‌ ఎక్స్‌ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్, LPDDR4X ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌ వంటి ఫీచర్లను అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. అలాగేa సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. 5జీ, డ్యూయల్ 4జీ వీవోఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఓటీజీ, జీపీఎస్/గ్లోనాస్/బీడో వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇచ్చారు.

ఇక ఈ ఫోన్‌లో 33 వాట్‌ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. వాటర్‌ ప్రూఫ్‌ కోసం ఐపీ52 రేటింగ్‌ను ఇచ్చారు. ఈ ఫోన్‌ను 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో లాంచ్‌ చేశారు. ధర విషయానికొస్తే ఆఫర్‌లో భాగంగా 4 జీబీ వేరియంట్ ధర రూ.13,999, 6 జీబీ వేరియంట్ ధర రూ.14,999, 8 జీబీ మోడల్ ధర రూ.15,999గా నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories