E Bike Go: మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ బైక్‌.. ఒక్క‌సారి ఛార్జ్‌ చేస్తే 160 కిలోమీట‌ర్లు

Lakh e Bike Booking in two Months 160 km on a Single Charge
x

ఈ బైక్ (ఫైల్ ఇమేజ్)

Highlights

E Bike Go: పెట్రోల్ ధ‌ర‌లు పెరుగుతుండ‌టం వ‌ల్ల సామాన్యులు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.

E Bike Go: పెట్రోల్ ధ‌ర‌లు పెరుగుతుండ‌టం వ‌ల్ల సామాన్యులు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ప్ర‌త్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. దీంతో ఇప్పుడు అంద‌రి దృష్టి ఎల‌క్ట్రిక్ బైక్‌ల వైపు మ‌ళ్లింది. రాబోయే భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల‌దే అని చెప్ప‌వ‌చ్చు. ఇప్ప‌టికే చాలా ఆటోమొబైల్ కంపెనీలు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను త‌యారు చేస్తున్నాయి. వాస్తవానికి రెండు నెల‌ల క్రితం మేడ్ ఇన్ ఇండియా కంపెనీ అయిన‌ e Bike Go తన ఎలక్ట్రిక్ బైక్‌కు లక్షకు పైగా ఆర్డర్‌లు వచ్చాయని ప్రకటించింది.

రెండు నెలల క్రితం స్వదేశీ కంపెనీ e Bike Go రెండు స్కూటర్లను విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. వాటికి R1GE, G1+అనే పేర్లు పెట్టారు. వీటి ప్రారంభ ధర రూ.85 వేలు కాగా ఇప్పుడు రూ.1.05 లక్షలకు చేరుకుంది. ఈ ధర కంపెనీది సబ్సిడీ కలిగి ఉండదు. దీపావళికి పండుగ కోసం ర‌గ్డ్ స్పెషల్ బైక్ లాంచ్ చేశారు. ఇవి రెడ్, బ్లూ, బ్లాక్, ర‌గ్డ్ స్పెషల్ ఎడిషన్ అనే నాలుగు కొత్త కలర్ ఆప్షన్‌లలో ఉన్నాయి. e Bike Go రగ్డ్ అనేది 'అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స‌, ఈ కంపెనీ దేశవ్యాప్తంగా తన ఉనికిని విస్తరించేందుకు కృషి చేస్తోంది. e Bike Go మొత్తం 22 డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసింది. కంపెనీ ప్రకారం ఇది రాబోయే నెలల్లో 50,000 బుకింగ్‌లను లక్ష్యంగా చేసుకుంది.

సింగిల్ ఛార్జ్‌తో 160 కమ్

రగ్డ్ EV అనేది 3kW మోటార్‌తో కూడిన మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తి. ఇది గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు. ఇ-బైక్‌లోని 2 x 2 kWh బ్యాటరీని మార్చవచ్చు దాదాపు 3.5 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిమీల రేంజ్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం దీని ప్రారంభ ధర రూ. 84,999. దీనిని కేవలం రూ .499 చెల్లించి ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories