JIO 5g: ఈ 5G స్మార్ట్‌ఫోన్‌లలో జియో పని చేయదు.. కొనేముందు జాగ్రత్త..!

Jio 5G Does not Work on These 5G Smartphones Know the List Before Buying
x

JIO 5g: ఈ 5G స్మార్ట్‌ఫోన్‌లలో జియో పని చేయదు.. కొనేముందు జాగ్రత్త..!

Highlights

JIO 5g: జియో దేశమంతటా ఇండిపెండెంట్‌గా 5G నెట్‌వర్క్‌ని అమలు చేస్తోంది.

JIO 5g: జియో దేశమంతటా ఇండిపెండెంట్‌గా 5G నెట్‌వర్క్‌ని అమలు చేస్తోంది. జియోకు భారతదేశంలో కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు. అయితే కొన్ని ఖరీదైన, మరికొన్ని చౌకైన 5G ఫోన్‌లు జియో 5G నెట్‌వర్క్‌కి సపోర్ట్‌ చేయవు. అలాంటి ఫోన్‌లు ఇప్పటికీ మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

Xiaomi భారతదేశంలో మిలియన్ల కొద్దీ 5G స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించింది. కానీ వీటిలో చాలా వరకు 5G ఇండిపెండెంట్‌ సపోర్ట్‌ లేదు. ఈ ఫోన్ 5G ఫోన్ అని చెప్పారు కానీ వీటికి Jio 5G సపోర్ట్‌ లేదు. Xiaomi Mi 10, Xiaomi Mi 10i ఈ రెండు ఫోన్‌లు జియో 5Gకి సపోర్ట్‌ చేయవు. ఈ ఫోన్ ఉన్న జియో యూజర్లకి ఇది టెన్షన్ పడే విషయమే. ఇకముందు 5G నెట్‌వర్క్‌ కావాలనుకునేవారు వీటికి దూరంగా ఉండటమే మంచిది.

ఈ రెండు ఫోన్లు చాలా ఖరీదు

ఈ రెండు ఫోన్‌లు బడ్జెట్ సెగ్మెంట్‌లో లేవు. రెండు ఫోన్ల ధర 20 వేల రూపాయల పైనే ఉంటుంది. ఈ ఫోన్‌ను కలిగి ఉన్న జియో వినియోగదారులు వీటిని 5Gగా మార్చడం మినహా వేరే మార్గం లేదు. లేదంటే ఎయిర్‌టెల్ వైపు వెళ్లాలి. మార్కెట్‌లోని చాలా స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే ఎయిర్‌టెల్ 5Gకి సపోర్ట్ ఇస్తున్నాయి. ఎందుకంటే ఎయిర్‌టెల్ 5G నాన్-స్టాండలోన్‌ని అమలు చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories