Human washing Machine : ఈ వాషింగ్‌ మెషీన్‌ బట్టలను కాదు మనుషులను ఉతికి ఆరేస్తుంది.. ఎలాగో తెలుసా?

Human washing Machine : ఈ వాషింగ్‌ మెషీన్‌ బట్టలను కాదు మనుషులను ఉతికి ఆరేస్తుంది.. ఎలాగో తెలుసా?
x
Highlights

Japanese invented Human washing Machine : ప్రస్తుతం మనం ధరించిన బట్టలను ఉతికేందుకు వాషింగ్ మెషీన్లను ఉపయోగిస్తున్నాం. కానీ భవిష్యత్తులో బట్టలు ఉతికి...

Japanese invented Human washing Machine : ప్రస్తుతం మనం ధరించిన బట్టలను ఉతికేందుకు వాషింగ్ మెషీన్లను ఉపయోగిస్తున్నాం. కానీ భవిష్యత్తులో బట్టలు ఉతికి ఆరేసినట్లు మనుషులను కూడా ఉతికి ఆరేసే హ్యూమన్ వాషింగ్ మెషీన్లు రాబోతున్నయట. రోజంతా రకరకాల పనులతో బాగా అలసిపోయిన వారికి స్నానం చేసే ఓపిక ఉండదు. అలాంటి వారు మెషీన్ టబ్ లో 15 నిమిషాలు కూర్చొంటే చాలు. కొద్ది నిమిషాల తర్వాత తలతలలాడే శరీరంతో బయటకు వస్తారట.

ఈ మెషీన్ లోని ఏఐ ఆ వ్యక్తి శరీరం, చర్మం తీరును పరిగణలోనికి తీసుకుని వాష్ అండ్ డ్రై ఆప్షన్ ను డిసైడ్ చేస్తుంది. జపనీస్ షవర్ హెడ్ సంస్థ సైన్స్ కో. ప్రజలకు స్నానాన్ని అందించడానికి ఉద్దేశించిన ఏఐ శక్తితో కూడిన వాషింగ్ మెషీన్ ఆఫ్ ది ఫ్యూచర్ ను కనిపెట్టిన తర్వాత టైడ్ పాడ్ లో పాడ్ ని ఉంచింది.

జపాన్ కు చెందిన సైన్స్ కో కంపెనీ ఇంజనీర్లు ఈ మెషీన్ ను తయారు చేశారని డెయిల్ మెయిల్ కథనం పేర్కొంది. ఒసాకా కన్సాయ్ ఎక్స్ పోలో వెయ్యి మంది గెస్టులు ప్రయోగాత్మకంగా వాడుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రదర్శన తర్వాత మాస్ ప్రొడక్షన్ వెర్షన్ ను విడుదల చేయనున్నట్లు సైన్స్ కో కంపెనీ చైర్మన్ వెల్లడించారు.

మనుషులు భవిష్యత్తు అవసరాలను పరిగణలోనికి తీసుకుని జపాన్ ఇంజనీర్లు దీనిని డిజైన్ చేశారు. ఈ ఫైటర్ జెట్ కాక్ పీట్ ఆకారంలోని ప్లాస్టిక్ ప్యాడ్ లోకి మనిషి వెళ్లిన తర్వాత అది సగానికిపైగా గోరువెచ్చని నీటిని నింపుతుంది. ఆ తర్వాత అందులోని హై స్పీడ్ జెట్స్ నీటిని వేగంగా విరజిమ్మి..స్నానం చేసే వ్యక్తిని ఆహ్లాదపరిచేందుకు ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి.

ఏఐ ద్వారా స్నానం చేస్తున్న వ్యక్తి శారీరక పరిస్థితిని మెషీన్ సేకరిస్తుందట. దానికి తగినవిధంగా ఇది యాక్ట్ చేస్తుందని ఇంజనీర్లు తెలిపారు. అయితే దీనిని వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఓసాకాలోని ఎక్స్ పో 2025లో మిరాయ్ నింగెన్ సెంటకుకిని ప్రదర్శించాలని యోచిస్తున్నారట.

Show Full Article
Print Article
Next Story
More Stories