ISRO: సూర్యుడి గుట్టువిప్పనున్న ప్రోబా-3.. ఇస్రో మరో కీలక ప్రయోగం

ISRO To Launch Esa’s Proba-3 Mission On Dec 4
x

ISRO: సూర్యుడి గుట్టువిప్పనున్న ప్రోబా-3.. ఇస్రో మరో కీలక ప్రయోగం

Highlights

అంతరిక్షంలో మరో అద్భుత ప్రయోగం చేసేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది.

ISRO: శాస్త్ర సాంకేతిక రంగాలను అభివృద్ధి చేసుకొని మానవుడు చేస్తున్న అత్యున్నత పరిశోధనలో ఇదో భాగమైందిప్పుడు జన్యుపరంగా మనిషిని పోలిన మనిషి, అనేక జంతు జీవాలను సృష్టించిన మనిషి... ఇప్పుడు మరో అద్భుత సృష్టికి సిద్ధమవుతున్నాడు... విశ్వశోధనలో ఇప్పటికే అనేక అద్భుతాలు ఆవిష్కరించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇప్పుడు మరో ప్రతి సృష్టికి సిద్ధమైంది. విశ్వానికి కాంతిని ప్రజ్వలింపజేసే సూర్యుడిని పోలిన మరో ఉపగ్రహాన్ని సృష్టించేందుకు ఇస్రో సిద్ధమైంది.

అంతరిక్షంలో మరో అద్భుత ప్రయోగం చేసేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. ఇప్పటివరకు చంద్రయాన్‌ లాంటి ప్రయోగం చేసి భారత్‌ను ప్రపంచ దేశాల సరసన సగర్వంగా నిలిపిన ఇస్రో ఇప్పుడు ఏకంగా సూర్యుడినే లక్ష్యంగా చేసుకుని ప్రయోగం నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా - త్రీని సూర్యుడి చుట్టూ పరిభ్రమింప జేసే యోచనలో ఉంది. ఈ ప్రయోగం ద్వారా నింగిలో కృతిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు తయారవుతోంది.

విశ్వంలో సృష్టికి ప్రతి సృష్టి అన్నట్లు కృత్రిమ సూర్యగ్రహణాన్ని ఏర్పాటు చేసేందుకు చేస్తున్న ఈ ప్రయోగంలో రెండు ఉపగ్రహాలను వినియోగిస్తోంది ఇస్రో. ఇందుకోసం సూర్యుడి బాహ్య వలయం కొరోనోను స్టడీ చేసేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. ఇది సవాలుతో కూడుకున్నదయినప్పటికీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది ఇస్రో. ఈ ప్రయోగం ద్వారా మొదట సూర్యుడి బాహ్యవలయంలో వాతావరణం ఎలా ఉంటుందో స్టడీ చేయనుంది. ప్రస్తుతం ఈ మిషన్ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఇస్రో తాజాగా తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

సూర్య కిరణాలను నిరోధిస్తూ... కృత్రిమ సూర్యగ్రహాన్ని సృష్టించే ప్రోబా - త్రీ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఈనెల 4న సాయంత్రం 4 గంటలకు ముహూర్తంగా ఎంచుకుంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో... ఇస్రోకి అచ్చొచ్చిన వాహక నౌకగా పేరుగాంచిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌ని ఇందుకు వినియోగించుకోనుంది.

ప్రోబా - త్రీ మిషన్‌లో ప్రత్యేకతలు గమనిస్తే ఇందులో ఓ కల్టర్ శాటిలైట్, కొరోనో గ్రాఫ్ శాటిలైట్ అనే రెండు ఉపగ్రహాలు ఉంటాయి. OSC సూర్యకాంతిని లేదా సూర్యరశ్మిని నిరోధించేందుకు రూపొందించిన 1.4 మీటర్ల డిస్క్ కలిగి ఉంటుంది. ఇది 150 మీటర్ల దూరంలో దాదాపు 8 సెంటీమీటర్ల వెడల్పుతో నీడను సృష్టిస్తుంది. ఈ నీడలోనే కొరోనో గ్రాఫ్ శాటిలైట్ CSC అమర్చడం జరుగుతుంది. ఇందులో 5 సెంటీమీటర్ల అపర్చర్‌తో కూడిన టెలిస్కోప్ ఉంటుంది. ఈ రెండు ఉపగ్రహాలు ఒకే లైనులో కరెక్ట్‌గా ఉంటాయి. ఈ అమరిక అపోజి వద్ద జరుగుతుంది. భూమి నుంచి దాదాపు 60 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉండడంతో ఉపగ్రహం స్థిరంగా ఉంటుంది.

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సోలార్ డైనమిక్స్‌లో ఎప్పటికప్పుడు చోటుచేసుకునే మార్పులను స్టడీ చేసేందుకు సోలార్ కొరోనో గురించి ఈ ప్రయోగం ద్వారా అధ్యయనం చేస్తారు. దీంతో అంతరిక్షంలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులపై కూడా అవగాహన వస్తుంది. సౌర తుఫానులు, కొరోనా నుంచి విడుదలయ్యే ఇతర సౌరవ్యర్థాలతో భూమిపై ఉన్న పవర్ గ్రిడ్లు, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలను అవి ఏ రకంగా ధ్వంసం చేయగలవో అంచనా వేయొచ్చు. అయితే కొరొనాను పరిశీలించడం అత్యంత కష్టమైన పని.

సూర్యుడి నుంచి వచ్చే కాంతి, కొరోనాలో ఉన్న అత్యంత కాంతివంతమైన పాయింట్ కంటే 10 లక్షల రెట్లు ఎక్కువ కాంతి ఉంటుంది. దీంతో టెలిస్కోపులకు కూడా ఈ ప్రయోగ దృశ్యాలను పరిశీలించడం సాధ్యపడదు. అయినప్పటికీ ఇస్రో అంతరిక్ష రహస్యాలను ఛేదించేందుకు అన్వేషణ మొదలు పెట్టింది. 1930లో కనుగొన్న కొరొనొగ్రాఫ్‌ల్లో ఉండే ఆకల్టింగ్ డిస్క్‌లు సూర్యకాంతిని అడ్డుకుంటాయి. సూర్యకాంతి నిటారుగా కాకుండా కాస్త ఒంపుతో ఉండటంతో కొరోనో అంతర్భాగం పూర్తిగా కాకుండా కొంత వరకు మాత్రమే కనిపిస్తుంది. దీని ద్వారా సహజ పద్ధతిలో ఏర్పడే సూర్య గ్రహణం కొరోనాను పరిశీలించేందుకు మార్గం సుగమం చేస్తుంది. అయితే ఇది చాలా అరుదుగా వస్తుంటుంది. అంతేకాదు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది.

ఇలాంటి సవాళ్లకు సమాధానంగా ప్రోబా - త్రీ డిజైన్ ఉంది. వీటన్నిటినీ చేధించేందుకే ప్రోబా - త్రీని తయారు చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు... ప్రోబా - త్రీ సృష్టిస్తున్న కృత్రిమ సూర్యగ్రహణంతో కొరోనాలో ఏం జరుగుతుందో..? ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏకధాటిగా 6 గంటల సమయం పాటు పరిశీలించి ఒక అంచనాకు రావొచ్చు. ఈ సందర్బంగా సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి... విశ్లేషణ కూడా ఖచ్చితత్వంతో చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయి కొరోనా మధ్య గ్యాప్‌ ఏర్పడటంతో ఇప్పటివరకు ఎలాంటి స్టడీ బయటకు రాలేదు. ఇక ఈ మిషన్ విజయవంతమైతే గ్యాప్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయనే అంశాన్ని శాస్త్రవేత్తలు బయటి ప్రపంచానికి తెలిపే అవకాశం ఉంది.

మొత్తానికి ప్రోబా - త్రీ ప్రయోగం సక్సెస్ అయితే సౌర పరిశోధన రంగంలో విప్లవాత్మకమైన అంశాలు బయటపడే అవకాశాలున్నాయి. అంతేకాదు సూర్యుడికి సంబంధించిన పలు అంశాలు, అక్కడి పరిసర వాతావరణంపై చోటు చేసుకునే మార్పులు, ఆ మార్పుల ప్రభావం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories