Smartphone: మీ స్మార్ట్‌ఫోన్‌ స్లోగా ఉందా.. అయితే ఇలా చేయండి..!

Is Your Smartphone Slow Follow These Tips and Increase Your Speed
x

Smartphone: మీ స్మార్ట్‌ఫోన్‌ స్లోగా ఉందా.. అయితే ఇలా చేయండి..!

Highlights

Smartphone: ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్‌ లేనిదే ఇంట్లో నుంచి కాలు కూడా బయటపెట్టరు.

Smartphone: ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్‌ లేనిదే ఇంట్లో నుంచి కాలు కూడా బయటపెట్టరు. ఎవ్వరిని చూసినా సెల్‌ఫోన్‌లో ఏదో ఒకటి చూస్తూ బిజీగా ఉంటారు. కాలం అలా మారిపోయింది. పలు పరిశోధనల్లో యువత గంటకు 10 సార్లు సెల్‌ ఫోన్‌ చూస్తారని తేలింది. ఇక దేశంలో 1.2 బిలియ‌న్ మంది మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అయితే నిరంతరం సెల్‌ఫోన్‌ ఉపయోగించడం వల్ల అది ఒక్కోసారి స్లో అయిపోతుంది. అంతేకాదు హ్యాంగ్‌ అవుతుంది కూడా అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం.

వాస్తవానికి స్మార్ట్‌ ఫోన్‌ స్లో కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫోన్‌లలో అడ్డగోలుగా ఫోటోలు, వీడియోలు లోడ్‌ చేస్తుండటం వల్ల కూడా వేగం తగ్గిపోతుంది. అంతేకాదు రకరకాల యాప్స్‌ వేసుకోవడం వల్ల స్టోరేజీ నిండిపోయి ఫోన్‌ నెమ్మదిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ను వేగంగా, స్మూత్‌గా మార్చడం మీ చేతిలోనే ఉంది. స్మార్ట్‌ఫోన్‌లోని కొన్ని సెట్టింగ్స్ మారిస్తే మీ ఫోన్ వేగంగా పనిచేస్తుంది. అవేంటో చూద్దాం.

1. ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేసి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయిందో లేదో చూడండి. లేకపోతే అప్‌డేట్ చేయండి. స్మార్ట్ ఫోన్‌లో యాప్స్ వేగంగా పనిచేయాలంటే వాటిని నిరంతరం అప్‌డెట్ చేస్తూ ఉండాలి. దీనికి గూగుల్ ప్లే స్టోర్ వెళ్ళీ ఏవైనా అప్‌డేట్ చేయాల్సి ఉందేమో చూడండి.

2. స్మార్ట్‌ఫోన్‌లో యానిమేషన్స్ ఉంటే స్లోగా ఆపరేట్ అవుతుంది. పాత స్మార్ట్‌ఫోన్స్‌లో యానిమేషన్స్ సరిగ్గా పనిచేయవు. అందుకే సెట్టింగ్స్ ఓపెన్ చేసి About పైన క్లిక్ చేయండి. Build number పైన ఏడు సార్లు ట్యాప్ చేయండి. డెవలపర్ మోడ్ ఎనేబుల్ అవుతుంది. ఆ తర్వాత సెట్టింగ్స్‌లో, సిస్టమ్స్‌లో డెవలపర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి. కిందకు స్క్రోల్ చేస్తే యానిమేషన్స్ కనిపిస్తాయి. యానిమేషన్స్ మొత్తం ఆఫ్ చేయండి.

3. అలాగే స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌లో స్టోరేజ్ పైన క్లిక్ చేయండి. Manage Storage పైన క్లిక్ చేయండి. అవసరం లేని ఫైల్స్, యాప్స్ డిలిట్ చేయండి. ముఖ్యమైన ఫైల్స్ ఎక్కువగా ఉంటే మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లోకి బ్యాకప్ చేసుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories