iQOO 13 Launch Date: ఐక్యూ 13 లెజెండ్ ఎడిషన్.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వచ్చేస్తుంది

iQOO 13
x

iQOO 13 Launch Date: ఐక్యూ 13 లెజెండ్ ఎడిషన్.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వచ్చేస్తుంది

Highlights

iQOO 13 Launch Date: ఐక్యూ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO 13 ను డిసెంబర్ 3 న భారతదేశంలో విడుదల చేస్తుంది.

iQOO 13 Launch Date: ఐక్యూ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO 13 ను డిసెంబర్ 3 న భారతదేశంలో విడుదల చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వచ్చిన రెండవ ఫోన్. దీనికి ముందు రియల్‌మి జిటి 7 ప్రో నవంబర్ 26 లాంచ్ కానుంది. ఐక్యూ ఈ ఫోన్ ప్రత్యేక ఎడిషన్‌లో BMW ట్రైయాంగిల్ డిజైన్‌ను కూడా ఉంటున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనిని లెజెండ్ ఎడిషన్ అని పిలుస్తారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

iQOO 13 Features

క్వాల్‌కమ్ సరికొత్త Snapdragon 8 Elite ప్రాసెసర్ ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగిస్తున్నారు. అదనంగా ఫోన్ గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి Q2 చిప్‌తో 144 fps ఫ్రేమ్ ఇంటర్‌పోలేషన్‌ను కూడా కలిగి ఉంది. ఫోన్ 2K 144Hz LTPO AMOLED డిస్‌ప్లే వినియోగదారులకు చాలా మృదువైన, ప్రతిస్పందించే అనుభవాన్ని అందిస్తుంది.

కెమెరా ముందు భాగంలో iQOO 13 ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50MP ప్రధాన కెమెరాతో సోనీ IMX921 సెన్సార్ 1/1.49-అంగుళాల సైజు ఉంటుంది. దీనితో పాటు 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా అందించారు. కెమెరా చుట్టూ ఉన్న లైట్ "హాలో లైట్" గేమింగ్‌ ప్రభావానికి అనుగుణంగా ఉంటుంది. ఇది గేమింగ్ అనుభవాన్ని మరింత ఆసక్తికరంగా చేస్తుంది.

ఇది కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6150mAh 3వ తరం సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంటుంది. ఇది లాంగ్ లైఫ్ బ్యాటరీని అందిస్తుంది. దీనితో పాటు ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది కేవలం 30 నిమిషాల్లో ఫోన్‌ను 100 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. లాంచ్ అయిన తర్వాత అమెజాన్ నుంచి మొబైల్‌ను ఆర్డర్ చేయచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories