iQOO 13 Price: 'ఐకూ 13' వచ్చేసింది.. సూపర్ కెమెరా, జంబో బ్యాటరీ! ధర ఏంటంటే?

iQOO 13 Price
x

iQOO 13 Price: 'ఐకూ 13' వచ్చేసింది.. సూపర్ కెమెరా, జంబో బ్యాటరీ! ధర ఏంటంటే?

Highlights

iQOO 13 Price: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ 'ఐకూ' సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.

iQOO 13 Price: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ 'ఐకూ' సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ 'ఐకూ 13'ని భారత్‌లో రిలీజ్ చేసింది. ఐకూ 12కు కొనసాగింపుగా 13ని తీసుకొచ్చింది. మూడు 50 ఎంపీ కెమెరాలు, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌తో ఈ ఫోన్ వచ్చింది. ఇక గేమింగ్‌ లవర్స్‌ కోసం ఐకూ క్యూ2 చిప్‌ను కూడా ఇచ్చారు. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68, ఐపీ 69 రేటింగ్‌ ఉంది. సూపర్ కెమెరా, జంబో బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ ఫుల్ డీటెయిల్స్ ఓసారి తెలుసుకుందాం.

ఐకూ 13 స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో వచ్చింది. 12జీబీ ర్యామ్‌ + 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.54,999 కాగా.. 16జీబీ ర్యామ్‌ + 512 జీబీ వేరియంట్‌ ధర రూ.59,999గా ఉంది. ఇది లెజెండ్‌, నార్డో గ్రే రంగుల్లో లబించనుంది. ఐకూ 13 విక్రయాలు డిసెంబర్‌ 11 నుంచి మొదలు కానున్నాయి. ఐకూ ఈ-స్టోర్‌ సహా ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో కొనుగోలు చేయొచ్చు. లాంచ్ ఆఫర్ కింద ఐసీఐసీఐ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు, హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై రూ.3 వేల డిస్కౌంట్‌ ఆఫర్ ఉంది. అంతేకాదు ఐకూ, వివో ఫోన్లను ఎక్స్‌ఛేంజ్‌ చేస్తే.. రూ.5వేల వరకు డిస్కౌంట్‌ కూడా పొందొచ్చు.

ఐకూ 13 ఫోన్‌లో 6.82 ఇంచెస్ 2కె ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. ఈ స్క్రీన్ 144 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేటు, 1800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. క్వాల్‌కామ్‌ లేటెస్ట్‌ ప్రాసెసర్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ను ఇందులో ఇచ్చారు. గేమింగ్‌ పర్ఫార్మెన్స్‌ కోసం ఐకూ క్యూ2 చిప్‌ ఉండగా.. హీట్‌ని కంట్రోల్‌ చేయడానికి 7000 ఎస్క్యూ ఎంఎం వ్యాపర్‌ ఛాంబర్‌ ఉంది. ఐకూ 13 వెనకాల ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 921 సెన్సర్‌, 50 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ సెన్సర్‌, 50 ఎంపీ టెలీ ఫొటోలెన్స్‌ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ కెమెరా ఉంటుంది. ఇందులో 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. అది 120 వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

ఐకూ 13 ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌:

# 6.82 ఇంచెస్ 2కె ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లే

# 144 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేటు, 1800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌

# స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌

# ఐకూ క్యూ2 చిప్‌

# 7000 ఎస్క్యూ ఎంఎం వ్యాపర్‌ ఛాంబర్‌

# మూడు 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్

# 32 ఎంపీ సెల్ఫీ కెమెరా

# 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

# ఐపీ68, ఐపీ 69 రేటింగ్‌

Show Full Article
Print Article
Next Story
More Stories