iPhone SE 4: బడ్జెట్ ఐఫోన్ వస్తుంది.. లాంచ్ ఎప్పుడంటే?

iPhone SE 4
x

iPhone SE 4

Highlights

iPhone SE 4: iPhone SE 4 ఈ సిరీస్‌లో అతిపెద్ద అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. అనేక AI ఫీచర్లను కూడా ఇందులో చూడొచ్చు.

iPhone SE 4: టెక్ కంపెనీ ఆపిల్ ఈ వారం పెద్ద లాంచ్ జరగబోతోంది. ఈ వారంలోనే Apple M4లో నడుస్తున్న Macsని కంపెనీ ప్రారంభించనుంది. అయితే కంపెనీ ఇతర ఉత్పత్తులపై చాలా పెట్టుబడి పెడుతోంది. ఇటీవలి నివేదికల ప్రకారం కంపెనీ త్వరలో iPhone SE 4 మోడల్‌ను పరిచయం చేయనుంది. మునుపటి సిరీస్ మాదిరిగానే ఈ ఫోన్ కూడా చౌకగా ఉండబోతోంది.

అయితే వచ్చే ఏడాది ఈ బడ్జెట్ ఐఫోన్‌ను చూసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఫోన్‌కు సంబంధించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. iPhone SE 4 లాంచ్ సమయం దగ్గరపడినట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ఫోన్‌ను విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. అంటే మార్చి 2025 నాటికి iPhone SE 4 మార్కెట్‌లో సందడి చేయనుంది

iPhone SE 4 ఈ సిరీస్‌లో అతిపెద్ద అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. అనేక AI ఫీచర్లను కూడా ఇందులో చూడొచ్చు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఆపిల్ 2025 మొదటి త్రైమాసికంలో ఐఫోన్ SE 4 ను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ ఫోన్‌ను వచ్చే ఏడాది జనవరి, మార్చి మధ్య ఎప్పుడైనా పరిచయం చేయవచ్చు.

ఇంతకుముందు కూడా కంపెనీ ఈ టైమ్‌లోనే SE మోడల్‌లను విడుదల చేస్తోంది. అయితే ఇప్పుడు ఇది iPhone SE 4 సాధ్యమైన లాంచ్ సమయం కావచ్చు. ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 16 సిరీస్‌లో అందించిన ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్, కెమెరా కంట్రోల్ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకార iPhone SE మోడల్‌ iPhone 14 డిజైన్‌లో కనిపిస్తుంది.

కంపెనీ ఈ ఫోన్‌ను OLED డిస్‌ప్లేతో లాంచ్ చేయవచ్చు. AI ఫీచర్ సపోర్ట్‌ని ఈ ఫోన్‌లో చూడవచ్చు. ఇది జరిగితే కంపెనీ ఈ కొత్త ఫోన్‌లో A17 ప్రో లేదా A18 చిప్‌సెట్‌ను అందించాల్సి ఉంటుంది. ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండొచ్చు. ఇది కాకుండా 6GB RAM ఇందులో ఉంటుంది.

ఛార్జింగ్ కోసం కంపెనీ యూఎస్‌బి టైప్ సి సపోర్ట్‌ని అందిచే అవకాశం ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను ఎప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తుంది, ఈ ఫోన్‌పై అభిమానులు ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories