iPhone 17: యాపిల్ భారీ ప్లాన్.. బిగ్ డిస్‌ప్లే, మరెన్నో అప్‌గ్రేడ్లతో ఐఫోన్ 17

iPhone 17 likely to feature 24-megapixel front-facing camera, A18 Pro chip
x

iPhone 17: యాపిల్ భారీ ప్లాన్.. బిగ్ డిస్‌ప్లే, మరెన్నో అప్‌గ్రేడ్లతో ఐఫోన్ 17

Highlights

iPhone 17: ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం ఐఫోన్ 17 మోడ‌ల్‌లో వ‌చ్చే ఏడాది చాలా మార్పులు కనిపించనున్నాయి. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 16 ప్రోలలో టైటానియం ఫ్రేమ్ ఇచ్చారు.

iPhone 17: యాపిల్ తన బ్రాండ్ నుంచి iPhone 16 సిరీస్‌ను లాంచ్ చేసిన చాలా కాలం తర్వాత, iPhone 17 గురించి ఇప్పటికే మార్కెట్లో చర్చలు ప్రారంభమయ్యాయి. ఐఫోన్ 17 ఎలా ఉంటుంది, దానిలో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి, ఏ అప్‌డేట్‌లు వస్తాయని, మనం ప్రతిరోజూ కొత్త విషయాలు చెక్ చేస్తుంటాం. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ అల్యూమినియం, గాజుతో చేసిన డిజైన్‌తో వెనుక ప్యానెల్‌ను కలిగి ఉంటాయని లీక్స్ వస్తున్నాయి.

ఐఫోన్ 17 నెక్స్ట్ జనరేషన్ ఫోన్ అని చెబుతూ కొన్ని ఫోటోలు, కథనాలు వైరల్ అవుతున్నాయి. ఐఫోన్ 17 మోడల్‌కు సంబంధించిన అనేక ఇతర వివరాలు వెల్లడయ్యాయి. ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్ 2025లో లాంచ్ అవుతుంది. టెక్ మార్కెట్‌లో జరుగుతున్న చర్చల ప్రకారం, 2025లో విడుదల కానున్న కొత్త iPhone 17లో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ మార్పు ఎలా ఉంటుంది? ఐఫోన్ 17లో ఏమి మారుతుందో చూద్దాం.

ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం ఐఫోన్ 17 మోడ‌ల్‌లో వ‌చ్చే ఏడాది చాలా మార్పులు కనిపించనున్నాయి. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 16 ప్రోలలో టైటానియం ఫ్రేమ్ ఇచ్చారు. ఐఫోన్ 17 అల్యూమినియం ఫ్రేమ్‌ను పొందినట్లయితే, ఇది ఇప్పటివరకు యాపిల్ చేసిన అతిపెద్ద మార్పు అవుతుందని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

కొన్ని లీక్‌ల ప్రకారం.. ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మాక్స్ యాపిల్ నెక్స్ట్ జనరేషన్ A18 ప్రో చిప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది TSMC కొత్త 3వ తరం 3nm ప్రాసెస్ ద్వారా తయారు చేశారు. ఈ మోడల్‌లోని కెమెరాకు సంబంధించి కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ఐఫోన్ 17 మోడల్‌కు కెమెరా అప్‌గ్రేడ్ రావచ్చని చెబుతున్నారు. కంపెనీ ఐఫోన్ 17లో 24-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను, ఐఫోన్ 17 ప్రోలో అప్‌గ్రేడ్ చేసిన 48-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను అందించే అవకాశం ఉందంటున్నారు.

ఈ చర్చలన్నీ నిజమైతే కంపెనీ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లో ఒక చిన్న డైనమిక్ ఐలాండ్‌ను కూడా అందించగలదు. దీనిలో బ్రాడ్‌కామ్‌కు బదులుగా కంపెనీ రూపొందించిన WiFi 7 చిప్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఐఫోన్ 17 విడుదలకు ఇంకా 8 నెలల సమయం ఉంది. మరి ఇప్పుడు జరుగుతున్న చర్చలు, పుకార్లు ఎంతవరకు నిజమో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories