iPhone 16 Vs iPhone 17: వావ్.. ఐఫోన్ 17 వచ్చేస్తుంది..16 సిరీస్‌తో పోలిస్తే ఛేంజస్ వేరే లెవల్ వర్మ..!

iPhone 16 Vs iPhone 17
x

iPhone 16 Vs iPhone 17

Highlights

iPhone 16 Vs iPhone 17: ఐఫోన్ 16 వర్సెస్ 17. రెండిటి మధ్య ఉండే ఛేంజస్, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే.

iPhone 16 Vs iPhone 17: ఆపిల్ డివైజ్‌లకు మార్కెట్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారైన వాడాలనుకునే వారు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలోనే ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు లాంచ్ డేట్ వచ్చినప్పటి నుంచి ఫుల్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు దీన్ని మరింత రెట్టింపు చేస్తూ కంపెనీ iPhone 17ను విడుదల చేయనున్నట్లు లీక్‌లు బయటకువచ్చాయి. ఈ రెండు మోడళ్ల మధ్య తేడా ఏమిటి? ప్రతి సంవత్సరం Apple దాని iPhone మోడల్‌లకు కొత్త ఫీచర్లుతో పరిచయం చేస్తుంది. ఈ నేపథ్యంలో iPhone 16, iPhone 17లో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉంటాయి. ఐఫోన్ 16 ఈ ఏడాది సెప్టెంబర్ 10న లాంచ్ కాబోతోంది.

iPhone 16 Design
ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 1170 x 2532 పిక్సెల్‌లు. దీని డిజైన్ స్టీల్, గ్లాస్ మిక్స్‌గా ఉంటుంది. ఇది ప్రీమియం లుక్‌ని ఇస్తుంది.

iPhone 17 Design
ఐఫోన్ 17 కొత్త స్లిమ్ డిజైన్, 6.2 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1290 x 2796 పిక్సెల్‌ల రిజల్యూషన్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది సన్నని బెజెల్స్, కొంచెం పెద్ద స్క్రీన్ ప్రాంతాన్ని కలిగి ఉంది. ఇది మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది.

iPhone 16 Processor
A16 బయోనిక్ చిప్‌ను iPhone 16లో ఉపయోగించారు. ఇది అద్భుతమైన పనితీరు, వేగవంతమైన ప్రాసెసింగ్‌ను అందిస్తుంది.

iPhone 17 Processor
iPhone 17లో A17 బయోనిక్ చిప్ ఉంది. ఇది A16 కంటే వేగవంతమైనది, అలానే శక్తివంతమైనది. ఇది గేమింగ్, మల్టీ టాస్కింగ్, ఇతర టాస్క్‌లలో మెరుగైన పనితీరును అందిస్తుంది.

iPhone 16 Camera
ఈ ఫోన్ 12 మెగాపిక్సెల్ , 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ సెటప్ 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

iPhone 17 Camera
ఐఫోన్ iPhone 17లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. అందులో 48 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ముందు కెమెరా 12 మెగాపిక్సెల్‌లు ఉంటాయి. ఇది4K డాల్బీ విజన్ HDR వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ క్వాలిటీ ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేస్తుంది.

iPhone 16 Battery
ఐఫోన్ 16లో 3,279mAh బ్యాటరీ ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ (20W వరకు), వైర్‌లెస్ ఛార్జింగ్ MagSafe‌కు సపోర్ట్ ఇస్తుంది.

iPhone 17 Battery
ఐఫోన్ 17 3,400mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ (25W వరకు), వైర్‌లెస్ ఛార్జింగ్ (MagSafe, Qi2సపోర్ట్ ఇస్తుంది. మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో ఇది ఎక్కువసేపు ఉంటుంది.

iPhone 16 Storage
ఐఫోన్ 16 స్టోరేజ్- 128GB, 256GB, 512GB ఉన్నాయి.

iPhone 17 Storage
ఐఫోన్ 17లో 128GB, 256GB, 512GB, 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి మరింత డేటా, యాప్‌లను స్టోర్ చేయగలవు.

iPhone 16 Software
ఐఫోన్ 16 iOS 16తో వస్తుంది. ఇది 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.0, NFCలకు సపోర్ట్ ఇస్తుంది.

iPhone 17 Software
ఐఫోన్ 17 iOS 17తో వస్తుంది. Wi-Fi 7, బ్లూటూత్ 5.3, మెరుగైన 5G కనెక్టివిటీని కలిగి ఉంది. ఇది భవిష్యత్ ప్రూఫింగ్‌లో సహాయపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories