iPhone 15 Pro Max Price Drop: ఐఫోన్ లవర్స్‌కు బెస్ట్ డీల్.. భారీగా పడిపోయిన 15 ప్రో మ్యాక్స్ ప్రైస్, ఇప్పుడు చాలా చౌకగా కొనచ్చు!

iPhone 15 Pro Max Price Drop
x

iPhone 15 Pro Max Price Drop

Highlights

iPhone 15 Pro Max Price Drop: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ను భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

iPhone 15 Pro Max Price Drop: ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర భారీగా తగ్గింది. Apple ఈ ప్రీమియం ఐఫోన్ లాంచ్ ధర కంటే వేల రూపాయల చౌకగా లభిస్తుంది. ఐఫోన్ 16 సిరీస్‌ను ప్రారంభించిన తర్వాత కంపెనీ తన ప్రో మాక్స్ మోడల్‌ను నిలిపివేసింది. Apple స్టోర్‌లో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులో లేదు. అయితే ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సీజన్ సేల్‌లో ఈ ఐఫోని కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 15 Pro Max ప్రారంభ ధర రూ. 1,21,999. ఇది లాంచ్ ధర కంటే రూ. 13 వేలు తక్కువ. అదే సమయంలో దాని 512GB వేరియంట్ ధర రూ. 1,26,999. ఆపిల్ దీన్ని రూ.1,54,900 ధరతో ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో UPI చెల్లింపుపై రూ. 4,000 వరకు ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉంది. అలానే HDFC కార్డ్‌లో రూ. 3,000 వరకు ఆదా చేసుకోవచ్చు. కంపెనీ దీనిపై పెద్ద ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తోంది. పాత ఐఫోన్ 14 ప్రోని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఈ ఐఫోన్‌ను రూ. 70 వేల లోపు కొనుగోలు చేయవచ్చు.

iPhone 15 Pro Max Features

ఐఫోన్ 15 Pro మ్యాక్స్‌లో 6.7 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే ఉంది. ఇది డైనమిక్ ఐలాండ్ డిజైన్‌తో ఉంటుంది. ఫోన్ డిస్ప్లే 2796 x 1290 పిక్సెల్ రిజల్యూషన్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌ వరకు సపోర్ట్ చేస్తుంది.

ఆపిల్ ఈ ఐఫోన్ A17 ప్రో బయోనిక్ చిప్‌తో వస్తుంది. ఈ ప్రాసెసర్ AI ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో గరిష్టంగా 1TB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఐఫోన్ పెద్ద బ్యాటరీ, USB టైప్ C ఛార్జింగ్ ఫీచర్‌తో వస్తుంది. ఇది ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. దీని డిస్‌ప్లే IP68 రేటింగ్‌తో వస్తుంది. దీని కారణంగా ఇది నీరు, దుమ్ములో కూడా దెబ్బతినదు.

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఫోన్‌లో 48MPమెయిన్ కెమెరా ఉంది. ఇది కాకుండా మరో రెండు 12MP కెమెరాలు ఉన్నాయి. ఈ ఐఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12MP కెమెరా కూడా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories