Infinix Xpad: వావ్‌.. ఇన్‌ఫినిక్స్‌ నుంచి ట్యాబ్‌ వచ్చేస్తోంది. ఫీచర్స్‌ ఎలా ఉండనున్నాయంటే..

Infinix launch new tab Infinix Xpad features and price details
x

Infinix Xpad: వావ్‌.. ఇన్‌ఫినిక్స్‌ నుంచి ట్యాబ్‌ వచ్చేస్తోంది. ఫీచర్స్‌ ఎలా ఉండనున్నాయంటే.. 

Highlights

ఇన్‌ఫినిక్స్‌ ఎక్స్‌ప్యాడ్ పేరుతో కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్‌ చేయనుంది. ఇన్‌ఫినిక్స్‌ ఎక్స్‌ప్యాడ్ 8 పేరుతో ఈ ట్యాబ్‌ను తీసుకొస్తున్నారు.

Infinix Xpad: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లకు ఎంత డిమాండ్ ఉందో ట్యాబ్లెట్స్‌కు కూడా అదే స్థాయిలో ఆదరణ లభిస్తోంది. ఎడ్యుకేషన్‌ మొదలు ఆఫీస్‌ అవసరాల వరకు ట్యాబ్‌ ఉపయోగం భారీగా పెరుగుతోంది. దీంతో చాలా మంది ట్యాబ్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్‌ తయారీ కంపెనీలు మార్కెట్లోకి ట్యాబ్స్‌ లాంచ్‌ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఇన్‌ఫినిక్స్‌ మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను విడుదల చేస్తోంది.

ఇన్‌ఫినిక్స్‌ ఎక్స్‌ప్యాడ్ పేరుతో కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్‌ చేయనుంది. ఇన్‌ఫినిక్స్‌ ఎక్స్‌ప్యాడ్ 8 పేరుతో ఈ ట్యాబ్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ట్యాబ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 11 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఇన్‌ఫినిక్స్‌ ఎక్స్‌ప్యాడ్ 2.2 జీహెచ్‌జెడ్‌ ఆక్టా కోర్‌ సీపీయూతో కూడిన హీలియో జీ99 ప్రాసెసర్‌ను అందించనున్నారు.

ఈ ట్యాబ్‌ను మూడు విభిన్న పవర్ మోడ్స్‌లో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్యాబ్‌ను ఎక్స్‌ఏరెనా గేమ్‌ స్పేస్‌ను అందించనున్నారు. ఈ ట్యాబ్‌ను రెండు వేరియంట్స్‌లో తీసుకొస్తున్నారు. వీటిలో మొదటిది 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఒకటి, రెండోది వేరియంట్‌ 8జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ని అందించారు. ఈ ట్యాబ్‌ను బ్లూ, బ్లాక్, గోల్డ్ కలర్స్‌లో తీసుకొస్తున్నారు. కెమెరా విషయానికొస్తే ఈ ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను అందించనున్నారు, అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 9 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

ఇక ఇన్‌ఫినిక్స్‌ ఎక్స్‌ప్యాడ్‌లో స్వంత ఫోలాక్స్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందించారు. ఈ ట్యాబ్‌ చాట్‌జీపీటీ ఆధారిత వాయిస్ అసిస్టెంట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 7000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నట్లు తెలుస్తోంది. 18 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 40 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జింగ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. అయితే ధరకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories