5G Smartphone Under 10000: దుమ్మురేపె 5G మొబైల్స్.. రూ.10 వేల లోపే.. బెస్ట్ ఏదో తెలుసా..?

5G Smartphone Under 10000
x

5G Smartphone Under 10000

Highlights

5G Smartphone Under 10000: ఇన్‌ఫినిక్స్, ఐటెల్, పోకో ఫోన్లను 10 వేల రూపాయల్లోపు కొనుగోలు చేయవచ్చు. ఇవి 5జీకి సపోర్ట్ చేస్తాయి.

5G Smartphone Under 10000: టెక్ మార్కెట్‌లో 5జీ ఫోన్ల హవా నడుస్తుంది. ప్రతి వినియోగదారుడు 5జీ మొబైల్‌కి అప్‌డేట్ అవ్వాలని చూస్తున్నారు. ఈ క్రమంలో మీరు కూడా కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? కానీ మీ బడ్జెట్ చాలా తక్కువగా ఉందని వెనుకడుగు వేస్తున్నారా? అయితే అప్పుడు Flipkart మీ కోసం ఉత్తమమైన డీల్‌లను తీసుకువచ్చింది. ప్రస్తుతం మీరు ఈ-కామర్స్ వెబ్‌సైట్ నుండి రూ. 10 వేల కంటే తక్కువ ధరకు 5G ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ కాకుండా మీరు ఈ ఫోన్‌లలో గొప్ప కెమెరా, 5000mAH పెద్ద బ్యాటరీని కూడా చూడవచ్చు. కొన్ని ఫోన్‌లలో కంపెనీ ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. తద్వారా మీరు మరింత తక్కువ ధరలో ఫోన్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. అటువంటి మూడు ఉత్తమైన మొబైల్ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Infinix Hot 50 5G
ఈ లిస్టులో ఇన్ఫినిక్స్ హాట్ 50 5G ఫస్ట్‌ప్లేస్‌లో ఉంది. ఇది ప్రస్తుతం రూ. 10 వేల లోపు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 12,999 అయినప్పటికీ ఎలాంటి ఆఫర్ లేకుండా కేవలం రూ. 9,999కే ఈ ఫోన్‌ని ఇప్పుడు మీ సొంతం చేసుకోవచ్చు. ఫోన్ రూ.9,450 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అయితే మీరు ఇక్కడ రూ.2 నుండి 3 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.

POCO M6 5G
జాబితాలో రెండవ ఫోన్ POCO M6 5G. ఇది 128GB ఇంటర్నల్ స్టోరేజ్ 6GB RAMతో వస్తుంది. Flipkart ఫోన్‌పై రూ. 4000 తగ్గింపును అందిస్తోంది. ఆ తర్వాత మీరు దీన్ని కేవలం రూ. 9,999తో మీ సొంతం చేసుకోవచ్చు. ఫోన్ 5000mAh బ్యాటరీ, 50MP బ్యాక్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

itel P 55 5G
జాబితాలోని చివరి ఫోన్ itel P 55 5G ఫ్లిప్‌కార్ట్‌లో చాలా చౌకగా లభిస్తుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 13,499. కానీ ఇప్పుడు మీరు దీన్ని రూ.9,861కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 50MP + 5MP బ్యాక్, 8MP ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీతో వస్తుంది. అయితే ఈ ఫోన్‌పై ఎలాంటి ఎక్స్ఛేంజ్ ఆఫర్ లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories