Infinix Note 40 5G Series Racing Edition: కిరాక్ ఫోన్లు లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్.. రూ.15,999కే 100W ఫాస్ట్ ఛార్జింగ్, JBL సౌండ్ టెక్నాలజీ..!

Infinix Note 40 5G Series Racing Edition
x

Infinix Note 40 5G Series Racing Edition

Highlights

Infinix Note 40 5G Series Racing Edition: Infinix నోట్ 40 5G సిరీస్ రేసింగ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. దీనిలో Infinix Note 40 Pro 5G, Infinix Note 40 Pro Plus 5G అనే రెండు ఫోన్‌లు ఉన్నాయి

Infinix Note 40 5G Series Racing Edition: స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్ఫినిక్స్ దేశంలో Infinix నోట్ 40 5G సిరీస్ రేసింగ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. కంపెనీ వీటిని తన 7వ వార్షికోత్సవ ఎడిషన్‌గా పరిచయం చేసింది. రేసింగ్ ఎడిషన్‌లో Infinix Note 40 Pro 5G, Infinix Note 40 Pro+ 5G అనే రెండు ఫోన్‌లు ఉన్నాయి. కంపెనీ తన రెగ్యులర్ మోడల్‌ను ఏప్రిల్‌లో విడుదల చేసింది. ఇప్పుడు రేసింగ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది F1 డిజైన్‌తో వస్తుంది. డిజైన్ కాకుండా, ఫోన్ స్పెసిఫికేషన్‌లు స్టాండర్డ్ మోడల్‌తో సమానంగా ఉంటాయి. ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్‌ల ధర, ఫీచర్లను ఒకసారి చూద్దాం.

Infinix Note 40 Pro 5G Racing Editon Price
ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ రేసింగ్ ఎడిషన్ 8GB+256GB వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర రూ.15,999గా ఉంటుంది. అయితే Infinix Note 40 Pro+ 5G రేసింగ్ ఎడిషన్ 12GB+256GB వేరియంట్‌‌ను రూ. 18,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. అంటే హెవీ ర్యామ్, స్టోరేజ్ ఉన్న ఈ రెండు ఫోన్ల ధర రూ.20,000 లోపే ఉంది. ప్రస్తుతానికి కంపెనీ బ్యాంక్ ఆఫర్‌ను వెల్లడించలేదు. ఈ రేసింగ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లు ఆరు నెలల వరకు నో-కాస్ట్ EMIతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయని Infinix ధృవీకరించింది. ఆగస్టు 26 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

Infinix Note 40 5G Racing Editon Features
ఇన్ఫినిక్స్ Note 40 5G రేసింగ్ ఎడిషన్ సిరీస్ ఫోన్ ఐకానిక్ F1 రేసింగ్ లోగోతో అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. దీని డిజైన్ బిఎమ్‌డబ్ల్యూ ఎమ్ పవర్ స్ఫూర్తితో కూడిన లెజెండరీ ట్రై కలర్‌తో పాటు కొన్ని క్లాసిక్ ఎలిమెంట్‌లను కలిగి ఉంది. వెనుక ప్యానెల్ హై క్వాలిటీ మెటీరియల్, సిల్వర్ ఫినిషింగ్‌తో వస్తుంది. ఫోన్‌పై సన్నని చారలు ఉంటాయి. దీని తయారీలో అత్యాధునిక యూవీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించామని కంపెనీ తెలిపింది. ప్రత్యేకమైన రేసింగ్ ఎడిషన్ వాల్‌పేపర్‌లు, ఐకాన్‌లు కూడా ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఫోన్ మిగిలిన స్పెసిఫికేషన్‌లు స్టాండర్డ్ మోడల్‌తో సమానంగా ఉంటాయి.

ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో రేసింగ్ ఎడిషన్ , నోట్ 40 ప్రో+ రేసింగ్ ఎడిషన్ రెండూ స్టాండర్డ్ మోడల్‌కు సమానమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. 6.78అంగుళాల పూర్తి-HD ప్లస్ (1080x2436 పిక్సెల్‌లు) కర్వ్డ్ LTPS AMOLED డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, 1,300 నిట్‌ల వరకు పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తాయి. ఫోన్‌లో MediaTek డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 12GB వరకు LPDDR4X RAM, 256GB UFS 2.2 ఇంబిల్ట్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లలో VC కూలింగ్ టెక్నాలజీ 2.0 కూడా ఉంది. ఇది 11 లేయర్‌ల హీట్ డిస్సిపేషన్ మెటీరియల్‌ని కలిగి ఉంది. ఫోన్‌ మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్‌ను అందిస్తుంది.

స్టాండర్డ్ ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో, నోట్ 40 ప్రో+లో ఉన్న అదే 108 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉన్నాయి. దానితో పాటు మరో రెండు 2 మెగాపిక్సెల్ సెన్సార్‌లు కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫోన్‌లో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. రెండు ఫోన్లు JBL ద్వారా ట్యూన్ చేయబడిన డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉన్నాయి. కనెక్టివిటీ కోసం 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS, NFC, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. దుమ్ము, నీటి స్ప్లాష్‌ల నుండి రక్షించబడటానికి రెండు మోడల్‌లు IP53 రేటింగ్‌తో వస్తాయి. ప్రో మోడల్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ ఉంది. ప్రో ప్లస్ మోడల్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4600 mAh బ్యాటరీని ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories