Infinix Note 40: ఇన్‌ఫినిక్స్‌ నుంచి కొత్త ఫోన్‌.. తక్కువ ధరలో 108 ఎంపీ కెమెరా

Infinix launches new smart phone in india Infinix Note 40 features and price details
x

 Infinix Note 40: ఇన్‌ఫినిక్స్‌ నుంచి కొత్త ఫోన్‌.. తక్కువ ధరలో 108 ఎంపీ కెమెరా

Highlights

Infinix Note 40: ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 స్మార్ట్‌ ఫోన్‌ ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 19,999గా నిర్ణయించారు.

Infinix Note 40: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్‌ ఈ మధ్య కాలంలో వరుసగా స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. బడ్జెట్‌ ధరలోనే మంచి ఫీచర్లతో ఈ కంపెనీ ఫోన్‌లను తీసుకొస్తోంది. ఇటీవల నోట్‌ 40 ప్రో, నోట్‌ 40 ప్రో+ పేరుతో కొత్త ఫోన్‌లను తీసుకొచ్చిన సంస్థ తాజాగా ఈ సిరీస్‌లో భాగంగా ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 స్మార్ట్‌ ఫోన్‌ ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 19,999గా నిర్ణయించారు. అయితే లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే డిస్కౌంట్‌లో ఈ ఫోన్‌ను రూ. 17,999కి సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 2 వేల డిస్కౌంట్‌ను పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 15,999కే పొందొచ్చు.

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 33 వాట్స్‌ వైర్డ్‌, 15 వాట్స్‌ వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. అలాగే ఇందులో ప్రత్యేకంగా ఏఐ బేస్డ్‌ లైటినింగ్‌ ఫీచర్‌ను అందించారు. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 2,436 x 1,080 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్ సొంతం.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్‌లో డస్ట్‌, స్ప్లాష్‌ రెసిస్టెంట్ కోసం ఐపీ53 రేటింగ్‌ను అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో వైఫై5, బ్లూటూత్‌, జీపీఎస్‌, ఓటీజీ, యూఎస్‌బీ టైప్‌ సీ పోర్ట్‌ వంటి ఫీచర్లను అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories