HP Laptop: అవును నిజం.. రూ. 10వేలకే ల్యాప్‌టాప్‌.. ఊహకందని ఆఫర్‌..!

Buy HP Chromebook 2024 at Just RS 10K in Flipkart, Check Here for Full Details
x

HP Laptop: అవును నిజం.. రూ. 10వేలకే ల్యాప్‌టాప్‌.. ఊహకందని ఆఫర్‌..!

Highlights

HP Laptop Offers: ప్రస్తుతం ల్యాప్‌టాప్‌ వినియోగం భారీగా పెరిగింది. ఒకప్పుడు కేవలం ఉద్యోగాలు చేసే వారే ల్యాప్‌టాప్‌ ఉపయోగించే వారు.

HP Laptop Offers: ప్రస్తుతం ల్యాప్‌టాప్‌ వినియోగం భారీగా పెరిగింది. ఒకప్పుడు కేవలం ఉద్యోగాలు చేసే వారే ల్యాప్‌టాప్‌ ఉపయోగించే వారు. కానీ ప్రస్తుతం స్కూల్‌కి వెళ్లే చిన్నారులు కూడా ల్యాప్‌టాప్‌లను ఉపయోగించే పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత ఆన్‌లైన్‌ క్లాస్‌లకు అలవాటైన చిన్నారులు, ఇప్పటికీ ఆన్‌లైన్‌లో కొన్ని కోర్సులు నేర్చుకుంటున్నారు.

దీంతో చాలా మంది ల్యాప్‌టాప్స్‌ను కొనుగోలు చేస్తున్నాయి. అయితే ల్యాప్‌టాప్స్ ఎక్కువ ధర అన్న కారణంగా చాలా మంది అవసరం ఉన్నా వెనుకడుగు వేస్తుంటారు. అయితే తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఓ ఆఫర్‌ లభిస్తోంది. కేవలం రూ. 10 వేలలోనే ల్యాప్‌టాప్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అవును నిజమే రూ. 10 వేలలోనే ల్యాప్‌టాప్‌ లభిస్తోంది. ఇంతకీ ఏంటా ల్యాప్‌ టాప్‌.? దాంట్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ (2024) అసలు ధర రూ. 34,554 కాగా ఏకంగా 68 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 10,990కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1250 డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఈ క్రోమ్‌ బుక్‌ను రూ. 10 వేల లోపే పొందొచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌ యూపీపీతో మొదటి ట్రాన్సాక్షన్‌ చేసే వారికి రూ. 50 డిస్కౌంట్‌ అందించనున్నారు.

ఇక ఈ క్రోమ్‌బుక్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 11.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లేను అందించారు. 1366x768 పిక్సెల్ రిజల్యూషన్‌, 220 నిట్స్‌ పీక్స్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన సొంతం. ఈ ల్యాప్‌టాప్‌ MediaTek MT8183 ప్రాసెసర్, 4GB LPDDR4X RAM, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో తీసుఒకచ్చారు. MediaTek ఇంటిగ్రేటెడ్ ARM Mali G72 MP3 గ్రాఫిక్స్ ప్రాసెసర్‌ని కూడా అందించారు.

ఈ క్రోమ్‌బుక్‌ క్రోమ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది ఇందులో ఇన్‌బిల్ట్‌గా ఇచ్చిన ఎన్నో యాప్స్‌ రోజువారీ అవసరాలను తీర్చడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కాలేజీ, పాఠశాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కంపెనీ దీన్ని తీసుకొచ్చింది. అయితే ఇతర ల్యాప్‌టాప్‌తో పోల్చితే అన్ని రకాల ఫీచర్లు ఇందులో ఉండవనే చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories