సచిన్ మొదటి కారు ధర 52 వేలు.. దీని చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

History of Maruti Suzuki Occupies 44 Percent of the car Market in the Country
x

సచిన్ మొదటి కారు ధర 52 వేలు.. దీని చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Highlights

Maruti Suzuki: మారుతీ సుజుకి దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ.

Maruti Suzuki: మారుతీ సుజుకి దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ. దాదాపు దేశ కార్ల మార్కెట్‌లో 44 శాతం ఆక్రమించింది. 800 మోడల్‌తో ప్రారంభమై దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఎదిగింది. 40 ఏళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 800 నుంచి డిజైర్ వరకు 18 మోడళ్లను ప్రవేశపెట్టారు. మారుతి సుజుకి ప్రయాణం తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారు. ఇది ఎంతోమంది కలల కారు అని చెప్పవచ్చు.

సచిన్ ఫస్ట్‌ కారు..

నేడు నిలిపివేసిన మారుతి 800కి ఒకప్పుడు ఆదరణ చాలా ఎక్కువ. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మొదటగా మారుతీ 800 కొనుగోలు చేశారు. షారుక్ ఖాన్ కూడా మారుతి 800 తీసుకున్నాడు. ఇది అప్పట్లో చాలా ఫేమస్‌ కారు. మారుతీ సుజుకి భారత్‌, జపాన్‌ కంపెనీల కలయిక. జపాన్‌కు చెందిన సుజుకి, భారతదేశానికి చెందిన మారుతీ మధ్య ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి ఇది భారతదేశంలోని ప్రధాన కంపెనీలలో ఒకటిగా మారింది.

సుజుకి అరంగేట్రం

సుజుకి జపాన్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి ప్రారంభమైంది. 1920లో సుజుకీ కంపెనీని మిచియో సుజుకీ ప్రారంభించారు. జపాన్ సుజుకి భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. సుజుకి చౌక కారు. దీనిని భారతదేశానికి తీసుకురావాలనే ఆలోచన మొదట 1959లో క్యాబినెట్ మంత్రి మనుభాయ్ షాకి వచ్చింది. తర్వాత సుజుకీ కోసం సంజయ్ గాంధీ కూడా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ 1981లో మరణించారు.

మొదటి మారుతీ

అనేక ప్రయత్నాల తర్వాత 1983లో మారుతి సుజుకి భారతదేశంలో తన మొదటి కారును విడుదల చేసింది. సుజుకి తొలిసారిగా మారుతీ 800ని దేశంలో విడుదల చేసింది. అప్పట్లో 800 ధర 52 వేల రూపాయలు. మొదటి కారుని లక్కీ డ్రా ద్వారా విడుదల చేశారు. మారుతీ 800 కోసం దాదాపు 20 వేల మంది బుక్ చేసుకున్నారు. అయితే హర్పాల్ సింగ్ అనే అదృష్టవంతుడు మాత్రమే లాటరీ ద్వారా మారుతీని కొనుగోలు చేసే అవకాశం పొందాడు. దీనిని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హర్పాల్ సింగ్‌కు అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories