Campus Recruitment: కాలేజీ క్యాంపస్‌లలో కొలువుల పంట

Heavily Campus Recruitment in Cognizant TCS Wipro Infosys Tech Mahindra Companies
x

భారీగా నియామకాలు చేపడుతున్న టెక్‌ సంస్థలు(ఫోటో - ది హన్స్ ఇండియా)

Highlights

*భారీగా నియామకాలు చేపడుతున్న టెక్‌ సంస్థలు *కాగ్నిజెంట్‌, టెక్‌ మహీంద్రా, విప్రోలో అత్యధిక ఉద్యోగాలు

Campus Recruitment: ఐటీ రంగంలో కొత్త నియామకాలు జోరందుకున్నాయి. కోవిడ్‌ ఉద్ధృతి తగ్గడంతో కాలేజీల్లో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ సందడి కనిపిస్తోంది. టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రాతోపాటు ఇతర ఐటీ కంపెనీలు గతేడాది కంటే ఎక్కువ సంఖ్యలో కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.

టీసీఎస్‌లో 55వేల ఉద్యోగాలు ఉండగా ఈ ఏడాది 20 వేల 400 మందిని నియమించుకుంది. క్యాంపస్‌, ఆన్‌లైన్‌ నియామకాల ద్వారా కొత్తగా మరికొంతమందిని తీసుకోనుంది. విప్రోలో 32వేల ఖాళీలు ఉండగా మార్చి, ఏప్రిల్‌, మేనెలల్లో 20వేలకుపైగా ఉద్యోగులను నియమించుకుంది. ఉన్న ఖాళీలతో పాటు కొత్తగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఎంపిక చేయాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసింది.

కాగ్నిజెంట్‌ కూడా కొత్తగా 17వేల 200 మంది ఉద్యోగులను నియమించుకుంది. ఈ ఏడాది చివరినాటికి కొత్తగా మరో 23వేల మందిని నియమించుకోనున్నట్లు తెలియజేసింది. ఇక ఇన్ఫోసిస్‌ కూడా 45వేల మందిని లక్ష్యంగా పెట్టుకుని నియామకాలు చేపడుతోంది. జేపీ మోర్గాన్‌ సంస్థ ఇప్పుడు వరంగల్‌

కరీంనగర్‌లోని కాలేజీల్లోనూ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌‌లు నిర్వహిస్తోంది. మొత్తానికి యువతలో ప్రస్తుత అవకాశాలు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories