Smart Phone: మీ స్మార్ట్‌ ఫోన్‌ నీటిలో పడిందా.. వెంటనే ఇలా చేయండి..!

Has your Smartphone Fallen Into Water do this Immediately
x

Smart Phone: మీ స్మార్ట్‌ ఫోన్‌ నీటిలో పడిందా.. వెంటనే ఇలా చేయండి..!

Highlights

Smartphone: కొంతమంది వేల రూపాయలు పెట్టి ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు కొంటారు.

Smartphone: కొంతమంది వేల రూపాయలు పెట్టి ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు కొంటారు. కానీ అవి నీళ్లలో పడినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా మొబైల్‌ పాడుచేసుకుంటారు. వాస్తవానికి ఫోన్‌ అనుకోకుండా వాటర్‌లో పడినప్పుడు ఏం చేయాలో ఎవ్వరికి తెలియదు. ఇలాంటి సమయంలో తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ఫోన్‌ పనికిరాకుండా పోతుంది. అందుకే స్మార్ట్‌ఫోన్‌ నీటిలో పడినప్పుడు ఏం చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

1. అనుకోకుండా మీ ఫోన్ నీటిలో పడితే ఎట్టి పరిస్థితిల్లోనూ ఆన్ చేయకూడదు. బటన్లను వత్తడం చేయకూడదు. ఫోన్‌ను షేక్ చేయటం చేయకూడదు.

2. మీకు తెలియకుండా ఫోన్‌ను ఇష్టమొచ్చినట్లు ఓపెన్ చేయటం వల్ల ఫోన్‌ వారంటీ కోల్పొవల్సి వస్తుంది. తడిచిన ఫోన్ పై గాలిని ఊదే ప్రయత్నం చేయవద్దు. దీనివల్ల నీళ్లు లోపలి భాగాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. మీకు అవగాహన లేకుండా ఏ విధమైన హీట్ డ్రైయర్‌ను ఉపయోగించకూడదు.

3. కొద్ది సేపటి తర్వాత ఫోన్‌ను ఓపెన్ చేసి సిమ్, మైక్రోఎస్డీ కార్డ్‌లను తొలగించాలి. అలానే బ్యాటరీని ఫోన్ నుంచి వేరు చేయాలి. క్లాత్ లేదా పేపర్ తీసుకుని సున్నితంగా ఫోన్‌లోని తడి ప్రాంతాలను డ్రై చేసే ప్రయత్నం చేయలి. తడి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే వాక్యుమ్‌ను ఉపయోగించి డివైస్‌ను డ్రై అయ్యేలా ప్రయత్నించాలి.

4. ఫోన్ తడిబారిన ప్రదేశం సాధారణ స్థాయికి వచ్చిన తరువాత జిప్‌లాక్ బ్యాగ్‌లో బియ్యాన్ని వేసి ఆ బియ్యంలో ఫోన్‌ను రెండు రోజుల పాటు కప్పి ఉంచాలి. ఇలా గాలికూడా చొరబడలేని బిగుతైన వాతావరణంలో ఫోన్‌ను ఉంచటం వల్ల ఏదైనా తడి ఉంటే ఆవిరైపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories