Google Pixel 9a: పిచ్చెక్కిస్తున్న గూగుల్.. ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్ ఫోన్.. మార్పు మొదలైనట్టే..!

Google Pixel 9a
x

Google Pixel 9a

Highlights

Google Pixel 9a: గూగుల్ త్వరలో Pixel 9a బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయనుంది. తాజాగా ఫీచర్స్ లీక్ అయ్యాయి.

Google Pixel 9a: ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో యమ క్రేజ్ ఉంది. ఈ ఫోన్‌లలో లేటెస్ట్ ఫీచర్లు ఉంటాయి. ఇప్పటి వరకు గూగుల్ తీసుకొచ్చిన ప్రతి వేరియంట్ రికార్డు స్థాయిలో సేల్స్ నమోదు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా కంపెనీ గూగుల్ పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ విడుదల చేసింది. ఇప్పుడు ఈ సిరీస్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌లో Pixel 9aని రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. అలానే Google ఈ సంవత్సరం మేలో ప్రపంచవ్యాప్తంగా Pixel 8aని ప్రారంభించింది. ఇందులో కొత్తగా డిజైన్ చేసిన కెమెరా మాడ్యూల్, ప్రాసెసర్ ఉంటుంది. అయితే Pixel 9a మొదటి రెండర్ రివిల్ అయింది. దీనిలో ఫోన్ వెనుక ప్యానెల్ డిజైన్‌ను చూడవచ్చు. ఇది ఫోన్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది.

Google Pixel 9a First Look
Pixel 9a ఈ రెండర్ ShrimpApplePro అనే ఎక్స్ అకౌంట్ నుంచి లీక్ అయింది. అయితే ఈ రెండర్ గురించి అఫిషియల్ ఇన్ఫర్మేషన్ తెలియలేదు. ఎందుకంటే ఈ ఫోన్ గురించి కంపెనీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. షేర్ చేయబడిన రెండర్‌లో బ్లాక్ షేడ్‌తో బాక్స్ డిజైన్‌తో కూడిన గ్యాడ్జెట్ కనిపిస్తుంది. ఫోన్ కెమెరా మాడ్యూల్ పిక్సెల్ 9 సిరీస్‌లోని ఇతర మోడల్‌ల వలె ఎంబాస్‌గా ఉండదు. ఇది వెనుక ప్యానెల్‌తో అటాచ్ చేయబడినట్లు కనిపిస్తోంది. కెమెరాతో LED ఫ్లాష్ లైట్ కూడా చూడవచ్చు.

Google Pixel 8a Features
ఈ సంవత్సరం ప్రారంభించబడిన Pixel 8a 6.10 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz వరకు రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్‌లో టెన్సర్ G3 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్ 8GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్‌లో 4492mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. ఈ గూగుల్ ఫోన్ ఆండ్రాయిడ్ 14తో లాంచ్ అయింది. దాని వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64MP మెయిన్, 13MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 13MP కెమెరాను ఉంది. ఇండియాలో ఈ గూగుల్ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 52,999. Pixel 9a ధర కూడా దీనికి దగ్గరగా ఉండొచ్చు. Googleఈ రాబోయే బడ్జెట్ ఫోన్ డిస్‌ప్లే నుండి ప్రాసెసర్‌కి పెద్ద అప్‌గ్రేడ్‌ను చూడవచ్చు. అదనంగా జెమిని AI అప్‌గ్రేడ్ వెర్షన్ కూడా ఇందులో ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories