Google Pixel 9 Pro: గూగుల్‌ నుంచి కళ్లు చెదిరే ఫోల్డబుల్ ఫోన్‌.. రూ. 23 వేల డిస్కౌంట్‌..!

Google launches Google Pixel 9 Pro Fold in india check here for features and price details
x

Google Pixel 9 Pro: గూగుల్‌ నుంచి కళ్లు చెదిరే ఫోల్డబుల్ ఫోన్‌.. రూ. 23 వేల డిస్కౌంట్‌..!

Highlights

గూగుల్‌ పిక్సెల్‌ 9 ప్రో ఫోల్డ్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 8 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ ప్యానెల్ డిస్‌ప్లేను అందించారు.

Google Pixel 9 Pro: టెక్‌ లవర్స్‌ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫోల్డబుల్‌ స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లోకి లాంచ్‌ అయ్యింది. గూగుల్ పిక్సెల్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లోకి లాంచ్‌ అయ్యింది. సెప్టెంబర్‌ 4వ తేదీ నుంచి ఈ ఫోన్‌లను అందుబాటులోకి వచ్చాయి. కళ్లు చెదిరే ఫీచర్లతో, స్టన్నింగ్ లుక్స్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌ పిక్సెల్‌ 9 ప్రో ఫోల్డ్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 8 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ ప్యానెల్ డిస్‌ప్లేను అందించారు. 2కే రిజల్యూషన్‌, 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో ఈ స్క్రీన్‌ను రూపొందించారు. 1800 నిట్స్‌ హెచ్‌డీఆర్‌, 2700 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ స్క్రీన్‌ 24 బిట్‌ కలర్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఇక కవర్‌ డిస్‌ప్లే విషయానికొస్తే 6.3 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇందులో 2700 నిట్స్‌ పీక్‌బ్రైన్‌ను అందించారు.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో టెన్సర్‌ జీ4 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌ను 16 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 45 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్, క్యూఐ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4650 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కెమెరా పరంగా చూస్తే ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను చ్చారు. ఇందులో 5 ఎక్స్‌ ఆప్టికల్‌, 20 ఎక్స్‌ సూపర్ రెస్‌ జూమ్‌ సపోర్ట్‌ను అందించారు.

ధర విషయానికొస్తే.. గూగుల్ పిక్సెల్‌ 9ప్రో ఫోల్డ్‌ 16 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 1,72,999గా నిర్ణియంచారు. అయితే లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఐసీఐసీ బ్యాంకుకు చెందిన క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 10,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే మీ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ సైతం అందిస్తున్నారు. మీ పాత ఫోన్‌ కండిషన్‌ ఆధారంగా గరిష్టంగా రూ. 13,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌పై గరిష్టంగా రూ. 23,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్‌లో అందుబాటులో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories