Google Pixel 9: గూగుల్‌ పిక్సెల్‌ 9 సిరీస్‌ సేల్స్ షురూ.. ఇలా కొంటే రూ.10వేల డిస్కౌంట్‌..!

Google Big Discount on Pixel 9 Series Phones in India Check Price and Features
x

Google Pixel 9: గూగుల్‌ పిక్సెల్‌ 9 సిరీస్‌ సేల్స్ షురూ.. ఇలా కొంటే రూ.10వేల డిస్కౌంట్‌..!

Highlights

లాంఛ్ ఆఫర్‌ కింద ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్‌ 9 సిరీస్‌ ఫోన్లను కొనుగోలు చేస్తే 30W పవర్‌ అడాప్టర్‌ను రూ.1,999లకే ఆఫర్ చేస్తున్నారు.

Google Pixel 9: నేటినుంచి గూగుల్‌ పిక్సెల్‌ 9 సిరీస్‌ ఫోన్లు సేల్ మొదలయ్యాయి. కాగా, ఈ ఫోన్లు ఆగస్టు 14న మేడ్‌ బై గూగుల్‌ ఈవెంట్‌లో రిలీజ్ చేశారు. ఆరోజు నుంచే బుకింగ్‌లు స్వీకరించారు. ఈ క్రమంలో నేటి నుంచి పిక్సెల్‌ 9, పిక్సెల్‌ 9 ప్రో ఎక్స్‌ఎల్‌ సేల్స్ మొదలయ్యాయి. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌, క్రోమా, రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లలో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే, ఈ సిరీస్‌లోని మిగతా ఫోన్లు 9 ప్రో, 9 ప్రో ఫోల్డ్‌ ఎప్పటినుంచి సేల్ చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు.

పిక్సెల్‌ 9 ఫోన్లపై భారీ ఆఫర్లు..

గూగుల్‌ పిక్సెల్‌ 9 భారత్‌లో రూ.79,999లు పేర్కొన్నారు. ఇందులో 256 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్‌‌తో అందుబాటులోకి వచ్చింది. పిక్సెల్‌ 9 ప్రో ఎక్స్‌ఎల్‌ ధర 1,24,999లుగా పేర్కొన్నారు. ఇది 256 జీబీ స్టోరేజీ, 16 జీబీ ర్యామ్‌‌ని కలిగి ఉంది. అయితే, ఈ ఫోన్లపై రిలయన్స్ డిజిటల్‌ భారీ ఆఫర్లు అందిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో పిక్సెల్‌ 9ను కొనుగోలు చేస్తే రూ.5,000ల డిస్కౌంట్ అందిస్తోంది. అదే పిక్సెల్‌ 9 ప్రో ఎక్స్‌ఎల్‌ను కొనుగోలు చేస్తే రూ.10,000ల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే..

లాంఛ్ ఆఫర్‌ కింద ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్‌ 9 సిరీస్‌ ఫోన్లను కొనుగోలు చేస్తే 30W పవర్‌ అడాప్టర్‌ను రూ.1,999లకే ఆఫర్ చేస్తున్నారు. అలాగే, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్‌ కార్డ్, ఈఎంఐలతో పిక్సెల్‌ 9 కొంటే రూ.4,000 డిస్కౌంట్, పిక్సెల్‌ 9 ప్రో ఎక్స్‌ఎల్‌ను కొనుగోలు చేస్తే రూ.10వేల డిస్కౌంట్ పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories