Best Smartphone Under 30000: మీరు రూ. 30,000 బడ్జెట్‌లో మంచి గేమింగ్, కెమెరా, బలమైన బ్యాటరీతో కూడిన ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ కథనంలో కొన్ని బెస్ట్ ఆప్షన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Best Smartphone Under 30000: మీరు రూ. 30,000 బడ్జెట్‌లో మంచి గేమింగ్, కెమెరా, బలమైన బ్యాటరీతో కూడిన ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ కథనంలో కొన్ని బెస్ట్ ఆప్షన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
OnePlus Nord CE 3 5G: ఈ ఫోన్‌లో మీరు 120hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లేను పొందుతారు. ఈ మొబైల్ ఫోన్ గేమింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 782G చిప్‌సెట్, 50MP Sony IMX890 సెన్సార్, 256GB వరకు స్టోరేజ్ సపోర్ట్ ఉంది. మీరు అమెజాన్ లేదా OnePlus అధికారిక వెబ్‌సైట్ నుంచి మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
Motorola Edge 40: స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని ఇష్టపడే వారికి, ఫోన్‌లో అనవసరమైన యాప్‌లను కోరుకోని వారికి ఈ Motorola ఫోన్ ఉత్తమమైనది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల pOLED డిస్‌ప్లే, MediaTek డైమెన్సిటీ 8020 ప్రాసెసర్, 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది.
POCO F5: ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో ప్రధాన లెన్స్ 64MP. ఈ ఫోన్ గేమింగ్‌కు చాలా బాగుంది. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2 (4nm) ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ, 6.67 అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే ఉన్నాయి.
Samsung Galaxy F54 5G: ఈ ఫోన్‌లో 108MP ప్రైమసీ కెమెరా ఉంది. మొబైల్ ఫోన్ Exynos 1380 5nm ప్రాసెసర్, 6.7 అంగుళాల డిస్ప్లే, 6000 mAh బ్యాటరీతో వస్తుంది.
Realme 11 Pro+ 5G: ఈ ఫోన్‌లో మీరు 200MP ప్రైమరీ కెమెరా, 5000 mAh బ్యాటరీతో డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ని పొందుతారు. మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి కేవలం రూ. 27,999కి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire