Free Netflix: ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌.. ఎలానో తెలుసా?

Free Netflix
x

Free Netflix

Highlights

Free Netflix: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన OTT ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన Netflix అత్యంత ఖరీదైన సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లను కలిగి ఉంది.

Free Netflix: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన OTT ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన Netflix అత్యంత ఖరీదైన సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లను కలిగి ఉంది. మీరు నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ని చూడాలనుకుంటే మీరు రీఛార్జ్ చేసుకోవాలి, ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాలి. అయితే మీకు కావాలంటే మీరు నెట్‌ఫ్లిక్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందించే మీ ప్రస్తుత నంబర్‌పై ప్రత్యేక రీఛార్జ్ చేయవచ్చు. ఈ విధంగా మీరు రోజువారీ డేటా, కాలింగ్‌తో ఉచితంగా Netlfixని ఆనందిస్తారు. దీని వివరాలను తెలుసుకుందాం.

Airtel

మీకు ఎయిర్‌టెల్ సిమ్ ఉంటే ఉచిత నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ కోసం రూ. 1,798 చెల్లించాలి. ఈ ప్లాన్‌తో 84 రోజుల వాలిడిటీ అందుబాటులో ఉంది. ప్రతిరోజూ 3GB రోజువారీ డేటా లభిస్తుంది. ఇది అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలను అందిస్తుంది. దీనితో రీఛార్జ్ చేస్తే Netflix Basic కాకుండా, Airtel Xstream సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. ఇది కాకుండా అపోలో 24/7, ఉచిత హెలోట్యూన్స్ యాక్సెస్ కూడా అందుబాటులో ఉంది.

Jio

రిలయన్స్ జియో రెండు ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. మొదటి ప్లాన్ రూ.1,799 కాగా రెండో ప్లాన్ రూ.1,299. ఇవి వరుసగా 3GB రోజువారీ డేటా, 2GB రోజువారీ డేటాను అందిస్తాయి. ఈ రెండు ప్లాన్‌లు 84 రోజుల వాలిడిటీతో వస్తాయి. అపరిమిత కాలింగ్‌తో పాటు ప్రతిరోజూ 100 SMS పంపే అవకాశం ఉంది. వినియోగదారులు రూ. 1,799 ప్లాన్‌తో రీఛార్జ్ చేసినప్పుడు నెట్‌ఫ్లిక్స్ (బేసిక్) సబ్‌స్క్రిప్షన్, రూ. 1,299 రీఛార్జ్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ (మొబైల్) సబ్‌స్క్రిప్షన్ పొందుతారు.

Vodafone Idea

వొడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్‌లు రూ. 1,198 రీఛార్జ్‌పై ఉచిత నెట్‌ఫ్లిక్స్ ఆనందించవచ్చు. ఈ ప్లాన్ 70 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలతో పాటు 2GB రోజువారీ డేటా వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఇతర ప్రయోజనాల గురించి చెప్పాలంటే రీఛార్జ్ చేయడం ద్వారా మీరు రాత్రిపూట అపరిమిత డేటా, వారాంతపు డేటా రోల్‌ఓవర్, డేటా డిలైట్స్ వంటి ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ (బేసిక్) సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories