Cyber Crime: ఆన్‌లైన్‌ మోసాల బారినపడొద్దంటే.. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిందే..!

Cyber Crime: ఆన్‌లైన్‌ మోసాల బారినపడొద్దంటే.. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిందే..!
x

 Cyber Crime: షేర్ మార్కెట్ పేరుతో డాక్టర్ బురడీ..సైబర్ మోసంతో రూ.8కోట్లు మాయం

Highlights

యూపీఐ పేమెంట్స్‌ విషయంలో కూడా నేరాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ మోసాల బారిన పడకుండా ఉండాంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Cyber Crime: మారుతోన్న టెక్నాలజీతో పాటు నేరాల శైలి కూడా మారుతోంది. రోజురోజుకీ సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రకరకాల మార్గాల్లో మోసం చేస్తున్నారు. ఎక్కడో కూర్చొని మన అకౌంట్‌లో డబ్బులను కాజేస్తున్నారు. యూపీఐ పేమెంట్స్‌ విషయంలో కూడా నేరాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ మోసాల బారిన పడకుండా ఉండాంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఈ మధ్య కాలంలో మీకు డబ్బులు పంపిస్తామంటూ క్యూఆర్‌ కోడ్‌ను పంపించి స్కాన్‌ చేయమని చెబుతున్నారు. అయితే మీకు ఎవరైనా డబ్బులు పంపించడానికి మీరు క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాల్సిన అవసరం లేదని గుర్తు పెట్టుకోవాలి. అలాగే, యూపీఐ పిన్​ కూడా డబ్బులు పంపేందుకు వాడతారే కానీ, రిసీవ్​ చేసుకునేందుకు కాదు. ఎవరైనా మీ యూపీఐ పిన్‌ అడిగితే అది కచ్చితంగా మోసమేనని గుర్తుపెట్టుకోవాలి.

* ఎవరైనా కాల్ చేసి ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసి యూపీఐ నెంబర్ ఎంటర్ చేయమని అడిగితే అది మోసంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీ యూపీఐ పిన్‌ను కేవలం పిన్‌ పేజీలో మాత్రమే ఎంటర్‌ చేయాలి తప్ప ఇతర యాప్‌లో వేరే సెక్షన్స్‌లో ఎంటర్ చేయకూడదని గుర్తు పెట్టుకోవాలి.

* ఇక ఈ మధ్య కాలంలో దొంగ క్యూ ఆర్‌ కోడ్‌లతో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే షాప్‌కి వెళ్లినప్పుడు అక్కడ ఒకటి కంటే ఎక్కువ క్యూఆర్‌ కోడ్స్‌ ఉంటాయి. అలాంటప్పుడు కోడ్ స్కోన్ చేసి పేమెంట్‌ చేసేప్పుడు పేరును చెక్‌ చేసుకొని ట్రాన్స్‌ఫర్‌ చేయాలి.

* ఇటీవల స్క్రీన్‌ షేరింగ్ ద్వారా కూడా సైబర్‌ మోసాలు భారీగా జరుగుతున్నాయి. స్క్రీన్‌ షేరింగ్‌ యాప్స్‌ ద్వారా బ్యాంక్‌ సమాచారం, లాగిన్‌ వివరాలు కాజేస్తున్నారు. కాబట్టి ఏదైనా అనుమానంగా ఉన్న లింక్స్‌ వస్తే ఎట్టి పరిస్థితుల్లో క్లిక్‌ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories