Cooling Tips: ఈ 4 టిప్స్ పాటిస్తే చాలు.. కూలర్ నుంచి ఏసీ కంటే చల్లని గాలి పక్కా.. ఇంట్లో మంచు కురవాల్సిందే..!

Follow These 4 Tips for High Cooling From Your Cooler
x

Cooling Tips: ఈ 4 టిప్స్ పాటిస్తే చాలు.. కూలర్ నుంచి ఏసీ కంటే చల్లని గాలి పక్కా.. ఇంట్లో మంచు కురవాల్సిందే..!

Highlights

Cooling Booster: వేసవి కాలం వచ్చిందంటే ఎండల కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటారు.

Cooling Booster: వేసవి కాలం వచ్చిందంటే ఎండల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. ఎండాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే కూలర్లు కూడ ఏసీ మాదిరిగానే పనిచేస్తాయి.

కూలర్‌ను ఎండలో ఉంచవద్దు..

చల్లని ప్రదేశంలో ఎలాగూ చల్లగా ఉంటుంది. అయితే, సాదారణంగా కూలర్లు వేడి గాలిని చల్లటి గాలిగా మార్చుతుందని భావిస్తుంటారు. కానీ ఇది జరగదు. ఎండ తాకని ప్రదేశంలో కూలర్‌ను ఉంచండి. నేరుగా సూర్యకాంతి కూలర్‌పై పడకుండా ఏర్పాట్లు చేయడం మంచిది.

కూలర్ చుట్టూ కొంత ఖాళీ స్థలం ఉండాలి..

కూలర్ కొత్తదైనా లేదా పాతదైనా దానిని ఎల్లప్పుడూ బహిరంగ ప్రదేశంలో ఉంచాలి. కూలర్ ఓపెన్ ఎయిర్‌లో చల్లని గాలిని అందిస్తుంది. కూలర్‌ను విండోకు అమర్చవచ్చు. ఇక్కడి నుంచి మంచి గాలి వస్తుంది.

వెంటిలేషన్ అవసరం..

మీరు ఇంట్లో కూలర్‌ను ఉపయోగిస్తుంటే గదిలో వెంటిలేషన్ ఉండటం ముఖ్యం. వెంటిలేషన్ లేకపోతే గది తేమగా మారుతుంది. గాలి బయటకు వచ్చినప్పుడు మాత్రమే కూలర్ చల్లదనాన్ని అందిస్తుంది.

గడ్డిని మారుస్తూ ఉండాలి..

మీరు పాత కూలర్‌ని ఉపయోగిస్తుంటే మొదట దాని గడ్డిని మార్చండి. పాత గడ్డిలో దుమ్ము పేరుకుపోతుంది. నీరు ప్రవహించదు. ఇటువంటి పరిస్థితిలో, ఒక సీజన్లో కనీసం రెండుసార్లు గడ్డిని మార్చండి. అలాగే, గడ్డి మధ్య ఖాళీ ఉండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories