Flipkart Flagship Sale: ఆఫర్ల సునామీ.. బ్రాండెడ్ ఫోన్లపై కళ్లుచెదిరే డీల్స్.. దొరికితే వదలొద్దు!

Flipkart Flagship Sale: ఆఫర్ల సునామీ.. బ్రాండెడ్ ఫోన్లపై కళ్లుచెదిరే డీల్స్.. దొరికితే వదలొద్దు!
x

Flipkart Flagship Sale

Highlights

Flipkart Flagship Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్ 20224ను ప్రారంభించింది. ఐఫోన్స్, సామ్‌సంగ్, వివో, స్మార్ట్ ‌టీవీలను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Flipkart Flagship Sale: దేశంలో ఈ కామర్స్ సంస్థల మధ్య భారీ పోటీ నెలకొంది. మార్కెట్‌లో నంబర్ వన్‌గా నిలిచేందుకు వరుసగా ఏదోక సేల్‌ను తీసుకొస్తున్నాయి. కొనుగోలుదారులును ఆట్రాక్ట్ చేసేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్‌ను ఈ రోజు అంటే ఆగస్టు 6 నుంచి ప్రారంభించింది. సేల్‌లో అనేక అద్భుతమైన ఉత్పత్తులు ఊహించని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సేల్‌‌లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌‌టాప్‌లు, స్మార్ట్‌ టీవీలను చౌక ధరలకే కొనుగోలు చేయవచ్చు.

అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కొనుగోలుదారులకు 10 శాతం స్పెషల్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. అయితే ఈ డిస్కౌంట్ కోసం ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్ కార్లులను మాత్రమే ఉపయోగించాలి. మీరు iPhone 15, Vivo T3 5G, Samsung Galaxy S23, Galaxy S23 FE, Moto Edge 50 Fusionఫోన్‌లపై బంపర్ డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఇది మాత్రమే కాదు బ్రాండెడ్ స్మార్ట్ టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్‌పై కూడా అద్భుతమైన డీల్స్‌ను అందిస్తోంది. ఈ ఉత్పత్తులపై 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది.

Flipkart Mobile Offers (ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ఆఫర్స్)
స్మార్ట్‌ఫోన్ డీల్స్‌లో సేల్ నుండి ఎలాంటి ఆఫర్ లేకుండా మీరు ప్రస్తుతం రూ.65,499కి iPhone 15ని కొనుగోలు చేయవచ్చు. అలానే నథింగ్ ఫోన్‌లపై గొప్ప ఆఫర్లను అందిస్తోంది. అదే సమయంలో Samsung Galaxy S23 5G ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ. 44,999 మాత్రమే. ఐఫోన్ 14 ప్లస్ ప్రస్తుతం రూ. 53,999కి అందుబాటులో ఉంది. Moto Edge 50 ఫ్యూజన్ సేల్‌లో రూ. 20,999కి కొనుగోలు చేయవచ్చు. అయితే మీరు రూ. 7999 ప్రారంభ ధరతో టాబ్లెట్‌ను కొనుగోలు చేయవచ్చు.

Flipkart Smart Tv Offers ( ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్స్)
స్మార్ట్ టీవీ డీల్స్ గురించి మాట్లాడితే మీరు సేల్‌లో రూ. 10,999 ప్రారంభ ధరతో 4 టీవీని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం రెడ్‌మీ 43 అంగుళాల అల్ట్రా HD (4K) TVపై 44 శాతం తగ్గింపును అందిస్తోంది. మీరు దీన్ని కేవలం రూ. 23, 999తో మీ సొంతం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు SONY Bravia 2 65 అంగుళాల టీవీ కేవలం రూ. 81,990 సేల్‌లో అందుబాటులో ఉంది. ఈ టీవీపై కంపెనీ 44 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. సేల్ సమయంలో మీరు కేవలం రూ. 3,555 ఈజీ EMI లేదా రూ. 15,000 వరకు తగ్గింపుతో అనేక ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories