Samsung: మీ ఊహకందని ఆఫర్‌.. రూ. 80 వేల ఫోన్‌ కేవలం రూ. 10 వేలకే..!

Flipkart is offering huge discounts on Samsung Galaxy S23 FE smartphones, Check here for full details
x

Samsung: మీ ఊహకందని ఆఫర్‌.. రూ. 80 వేల ఫోన్‌ కేవలం రూ. 10 వేలకే..!

Highlights

Samsung: పండగ సీజన్‌లో భాగంగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలన్నీ ఆఫర్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.

Samsung: పండగ సీజన్‌లో భాగంగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలన్నీ ఆఫర్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్ట్‌ ది బిగ్‌ బిలియన్‌ డేస్‌ పేరుతో ఓ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై భారీ తగ్గింపు ధరలు ఈ సేల్‌లో లభిస్తున్నాయి. ఇందులో భాగంగానే సామ్‌సంగ్‌ ఫోన్‌పై ఫ్లిప్‌ కార్ట్‌ కళ్లు చెదిరే ఆఫర్‌ను అందిస్తోంది. ఇంతకీ ఏంటా ఫోన్‌.? ఆ ఆఫర్‌ ఏంటి.? తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 79,999గా ఉండగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఏకంగా 62 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 29,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్‌ ఇక్కడితో ఆగిపోలేదు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో సుమారు రూ. 1500 వరకు అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.

ఇక ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ సైతం అందిస్తున్నారు. మీ పాత ఫోన్‌ కండిషన్‌ ఆధారంగా ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 19,800 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ లెక్కన ఈ ఫోన్‌ను కేవలం రూ. 10 వేలలోనే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ కేవలం బిగ్‌బిలియన్‌ డేస్‌ ఉన్నన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఈ ఫెస్టివల్‌ సేల్‌లో బెస్ట్ డీల్స్‌లో ఇదీ ఒకటని చెప్పొచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే..

ఇక ఫీచర్ల విషయంలో కూడా ఈ ఫోన్‌ తగ్గేదేలే అన్నట్లు ఉంది. గ్యాలక్సీ ఏఐ వంటి అధునాతన ఫీచర్‌ను ఇందులో అందించారు. ఈ ఫోన్‌లో 6.4 ఇంచెస్‌తో కూడి ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఈ ఫోన్‌ సొంతం. అలాగే కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్స్‌, 12 మెగాపికసెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 10 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్‌లో సామ్‌సంగ్‌ exynos 2200 ప్రాసెసర్‌ను అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories