Smart TV Offer: పండక్కి పెద్ద టీవీ కొనాలని చూస్తున్నారా.? రూ. లక్ష టీవీని రూ. 25 వేలకే సొంతం చేసుకోండి..!

Smart TV Offer
x

Smart TV Offer

Highlights

Smart TV Offer: ఫాక్స్‌ స్కై(Foxsky) కంపెనీకి చెందిన 55 ఇంచెస్‌ అల్ట్రా హెచ్‌డీ 4కే రిజల్యూషన్‌ స్మార్ట్‌ టీవీ (Foxsky 55 Inches Smart TV) అసలు ధర రూ. 97,990కాగా Flipkart సేల్‌లో భాగంగా ఏకంగా 72 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

Smart TV Offer: దసరా పండుగ వచ్చిందంటే ఇంట్లోకి ఏదో కొత్త వస్తువును కొనుగోలు చేయాలని చాలా మంది కోరుకుంటారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. టీవీలు, వాషింగ్ మిషన్స్‌, ఫ్రిజ్‌లు ఇలా రకరకాల వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇందుకు అనుగుణంగానే ఈ కామర్స్‌ సంస్థలు సైతం ఆఫర్లను అందిస్తుంటాయి.

ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌ కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ (Flipkart Big Billion Day Sale)పేరుతో మంచి ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అన్ని రకాల వస్తువులపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. మరి ఈ పండక్కి మీరు కూడా కొత్త టీవీ కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారా.? అయితే మీ కోసమే ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఒక మంచి డీల్‌ ఉంది. ఫాక్స్‌ స్కై (Foxsky) కంపెనీకి చెందిన టీవీపై ఏకంగా 72 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ డీల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫాక్స్‌ స్కై కంపెనీకి చెందిన 55 ఇంచెస్‌ అల్ట్రా హెచ్‌డీ 4కే రిజల్యూషన్‌ స్మార్ట్‌ టీవీ (Foxsky 55 Inches Smart TV) అసలు ధర రూ. 97,990కాగా ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో (Flipkart Sale) భాగంగా ఏకంగా 72 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ టీవీని కేవలం రూ. 26,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్‌ ఇక్కడితోనే ఆగిపోలేదు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. అదే విధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 అదనపు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ టీవీని కేవలం రూ. 25 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇక మీ పాత టీవీని ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా కూడా డిస్కౌంట్ పొందొచ్చు. మీ పాత టీవీ కండిషన్‌ ఆధారంగా గరిష్టంగా రూ. 15,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ టీవీలో 55 ఇంచెస్‌తో కూడిన అల్ట్రా హెచ్‌డీ 4కే ఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. ఇక 3840 x 2160 పిక్సెల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు సపోర్ట్ చేసే ఈ స్మార్ట్‌ టీవీలో నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌, యూట్యూబ్‌ వంటి యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఇందులో 30 వాట్స్ సౌండ్‌ అవుట్‌పుట్‌కు సపోర్ట్ చేసే స్పీకర్లను అందించారు. 10 రోజుల రీప్లేస్‌మెంట్ గ్యారంటీనికి కూడా కంపెనీ అందిస్తుండడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories