Price Drop Alert: ఈసారి వదలకండి.. భారీగా తగ్గిన ఐఫోన్ 14, 15 ధరలు.. పోతే మళ్లీ రావ్..!

Price Drop Alert
x

Price Drop Alert

Highlights

Price Drop Alert: ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14, 15లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Price Drop Alert: iPhone 16 సిరీస్ మరికొన్ని గంటల్లో అందుబాటులోకి రానుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఆపిల్ వార్షిక ఈవెంట్ సెప్టెంబర్ నెలలో జరుగుతుంది. కంపెనీ తాజా మోడల్‌ను ఇట్స్ గ్రో టైమ్ ఈవెంట్‌లో తీసుకురానుంది. ఈ రోజు రాత్రి 10:30 గంటలకు ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌తో పాటు అనేక ఇతర గ్యాడ్జెట్లను పరిచయం చేయనుంది. అయితే లాంచ్‌కు ముందు ఐఫోన్ 14,15 మోడల్ ధరలను భారీగా తగ్గించింది. ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆఫర్లపై కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్లు, డీల్‌ల కారణంగా రెండింటి బేస్ మోడల్‌లు లాంచ్ ధర కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఐఫోన్ 15 128 జీబీ వేరియంట్‌పై ఫ్లిప్‌కార్ట్ నేరుగా 12 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. దీని అసలు ధర రూ.79,600కి బదులుగా రూ.69,999గా మారింది. ధరపై తగ్గింపు పొందడమే కాకుండా వినియోగదారులు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా మరిన్ని తగ్గింపులను కూడా పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ. 1000 వరకు తగ్గింపు లభిస్తుంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్ గురించి మాట్లాడినట్లయితే వినియోగదారులు పాత మోడల్‌ను మార్చడం ద్వారా రూ. 46,350 వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే మోడల్ సరికొత్త వేరియంట్‌లో ఉండాలి. ఇది కాకుండా నిబంధనల ప్రకారం మాత్రమే మీరు రూ. 46,350 వరకు తగ్గింపును పొందగలరు.

ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14 128 జీబీ వేరియంట్‌పై నేరుగా 16 శాతం తగ్గింపు అందిస్తుంది. దీని అసలు ధర రూ.69,600కి బదులుగా రూ.57,999కి దక్కించుకోవచ్చు. అలానే ధరపై తగ్గింపు పొందడమే కాకుండా, వినియోగదారులు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా మరిన్ని డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ. 1000 వరకు తగ్గింపు లభిస్తుంది.

ఎక్స్ఛేంజ్ ఆఫర్ విషయానికి వస్తే వినియోగదారులు పాత మోడల్‌ను మార్చడం ద్వారా రూ. 38,350 వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే దీని కోసం ఫోన్ ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉండాలి. మోడల్ సరికొత్త వేరియంట్‌లో ఉండాలి. ఇది కాకుండా నిబంధనల ప్రకారం మాత్రమే మీరు రూ. 38,350 వరకు తగ్గింపును పొందగలరు.

Show Full Article
Print Article
Next Story
More Stories