Poco F6 5G: ఫ్లిప్‌కార్ట్ షాకింగ్ ఆఫర్.. ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో 5జీ ఫోన్ దక్కించుకోవచ్చు..!

Poco F6 5G
x

Poco F6 5G

Highlights

Big Billion Days Sale: సేల్‌లో భాగంగా POCO F6 5Gని ఫ్లిప్‌కార్ట్ నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీనిపై 29 శాతం డైరెక్ట్ డిస్కౌంట్ లభిస్తుంది.

Poco F6 5G: ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో మొబైల్స్ బెస్ట్ ఆఫర్‌లను ప్రకటించింది. కొత్త మొబైల్‌ భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను ఆఫర్ చేస్తోంది. సేల్‌లో భాగంగా POCO F6 5Gని ఫ్లిప్‌కార్ట్ నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీనిపై 29 శాతం డైరెక్ట్ డిస్కౌంట్ లభిస్తుంది. 8 GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 23,999కి కొనుగోలు చేయవచ్చు. అదనంగా మీరు ఎంచుకున్న బ్యాంకుల నుండి ఆఫర్లు కుడా దక్కించుకోవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Poco F6 5G Features

Poco F6 5G మొబైల్‌కు 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లే 2712 x 1220 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ అందిస్తోంది. అలాగే ఈ డిస్ప్లే 2400 nits బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కలిగి ఉంది. అలాగే HRD+, Dolby Vision ఆప్షన్స్ ఉన్నాయి.

మొబైల్ Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Android 14 OSకి కూడా సపోర్ట్ ఇస్తుంది. ఈ మొబైల్ వరుసగా 8GB + 256 GB, 8GB + 256 GB, 12GB + 512 GB స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

Poco F6 5G మొబైల్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ . సెకండరీ కెమెరా 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్‌ను కలిగి ఉంది. దీనితో పాటు, ముందు భాగంలో సెల్ఫీల కోసం 20 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా అందించారు.

Poco F6 5G మొబైల్ 5,000 mAh కెపాసిటీ బ్యాటరీ బ్యాకప్‌తో 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలాగే 120W ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ ఫీచర్ ఉంది. ఇది 35 నిమిషాల్లో బ్యాటరీ 100 శాతం వరకు ఫుల్ ఛార్జ్ చేస్తుంది. టైటానియం, బ్లాక్ కలర్ ఎంపికలలో దీన్ని ఆర్డర్ చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories