Flipkart Best Deal: కొత్త ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే ఈ ఆఫర్ చూస్తే వదలరు..!

Motorola G64 5G
x

 Motorola G64 5G

Highlights

Flipkart Best Deal: ఫ్లిప్‌కార్ట్‌ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ సేల్‌లో Motorola G64 5Gపై బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది.

Flipkart Best Deal: ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిట్‌కార్ట్‌లో మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట జరుగుతుంది. ఆగస్టు 26 వరకు జరగనున్న ఈ సేల్‌లో మీరు దాదాపు అన్ని కంపెనీల ఫోన్‌లను భారీ తగ్గింపులతో కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో మీరు మోటరోలా అభిమాని అయితే ఈ సేల్ అసలు మిస్ చేయకండి. ఎందుకంటే 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్‌ Motorola G64 5Gపై బంపర్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ క్రమంలో ఫోన్ ఫీచర్లు, ఆఫర్లు తదితర వివరాలను తెలుసుకుందాం.

ఫోన్ అసలు ధర రూ.16,999గా ఉంది. సేల్‌లో అందిస్తున్న బ్యాంక్ డీల్‌లో ఈ ఫోన్ రూ. 2,000 తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. 11,850 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే అదనపు డిస్కౌంట్ మీ పాత ఫోన్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది.

Motorola G64 5G Features
కంపెనీ ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను తీసుకొచ్చింది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. డిస్‌‌ప్లే టచ్ శాంప్లింగ్ రేటు 240Hz. అంతేకాకుండా డిస్‌ప్లే ప్రొటక్షన్ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో గొరిల్లా గ్లాస్‌ను కూడా అందిస్తోంది. ఫోన్ 12 GB RAM+ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ప్రాసెసర్‌గా మీరు ఫోన్‌లో MediaTek Dimension 7025 చిప్‌సెట్‌ని చూడవచ్చు. ఫోన్ ఫోటోగ్రఫీ కోసం LED ఫ్లాష్‌తో కూడిన రెండు కెమెరాలను కలిగి ఉంది.

వీటిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఫోన్‌లో సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. పవర్ కోసం Motorola ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీని ఉంది. ఇది 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. OS విషయానికొస్తే ఫోన్ Android 14లో పనిచేస్తుంది. దీని కోసం కంపెనీ ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్‌ను కూడా రిలీజ్ చేస్తుంది ఫోన్‌లో డాల్బీ అట్మోస్‌ను కూడా ఉంటుంది. కనెక్టివిటీ కోసండ్యూయల్ సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories