Flipkart Diwali Sale 2024: రూ. 9 వేలకే 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ... ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కళ్లు చెదిరే డీల్

Flipkart Diwali Sale 2024
x

Flipkart Diwali Sale 2024

Highlights

Flipkart Diwali Sale 2024: దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలన్నీ భారీ డిస్కౌంట్స్ అందిస్తున్న విషయం తెలిసిందే.

Flipkart Diwali Sale 2024: దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలన్నీ భారీ డిస్కౌంట్స్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఫ్లిప్‌కార్ట్ అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ క్రమంలోనే థామ్సన్ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీపై ఊహకందని డిస్కౌంట్ లభిస్తోంది. ఇంతకీ ఏంటా టీవీ, ఫీచర్స్ ఎలా ఉండనున్నాయి లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

థామ్సన్ 9A సిరీస్ స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్ మంచి ఆఫర్ అందిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 14,999 కాగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా 31% డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ టీవీని రూ. 9,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ డిస్కౌంట్ సేల్ ఇక్కడితో ఆగిపోలేదు. ఎస్బీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 తగ్గింపు పొందొచ్చు. ఇలా ఈ టీవీని కేవలం రూ. 8,999కి సొంతం చేసుకోవచ్చు. ఇక మీ పాత టీవీని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా అదనంగా మరో రూ. 3000 వరకు డిస్కౌంట్స్ పొందొచ్చు. ఇలా అన్ని కలిపి ఈ 9A టీవీని కేవలం రూ. 5,999కే దక్కించుకోవచ్చు.

9A టీవీ ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..

9A టీవీ ఫీచర్స్ విషయానికొస్తే ఈ స్మార్ట్ టీవీలో 32 ఇంచెస్‌తో కూడిన ఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. 60 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఈ టీవీలో రెండు స్పీకర్లను అందించారు. 30 వాట్స్ అవుట్ పుట్ స్పీకర్లు ఈ మోడల్ టీవీ సొంతం. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి సపోర్ట్ చేసే ఈ టీవీలో 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఇచ్చారు. స్మార్ట్ టీవీపై ఏడాది వారంటీని అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories