Flipkart Big Billion Days 2024: డేట్ వచ్చేసింది.. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో వీటిపై 80 శాతం డిస్కౌంట్..పండగే ఇక..!

Flipkart Big Billion Days Sale 2024
x

Flipkart Big Billion Days Sale 2024 

Highlights

Flipkart Big Billion Days 2024: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 26 నుండి ప్రారంభమవుతుంది. బ్యంక్ ఆఫర్లతో స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ను 80 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

Flipkart Big Billion Days 2024: ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్. ప్రముఖ ఇ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఈ సంవత్సరంలో తన అతిపెద్ద సేల్ రాబోతోందని అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే కంపెనీ సేల్ తేదీని ప్రకటించింది. ఆ తర్వాత ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో వస్తున్న డీల్స్‌ని టీజ్ చేసింది. బ్యాంక్ ఆఫర్లను కూడా వెల్లడించింది. సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, హోమ్ నీడ్స్, ఇతర ఎలక్ట్రానిక్స్‌ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2024 సేల్ సెప్టెంబర్ 27 నుండి ప్రారంభమవుతుంది. అయితే మీరు Flipkart Plus మెంబర్‌షిప్ కలిగి ఉంటే కస్టమర్‌లు సెప్టెంబర్ 26 నుండి కొన్ని పెద్ద డీల్స్, ఆఫర్‌లను ఆస్వాదించగలరు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ రూ. 499కి అందుబాటులో ఉంటుంది.

అప్లికేషన్‌పై షేర్ చేసిన టీజర్‌లో HDFC బ్యాంకింగ్ పాట్నర్‌గా ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. మీరు డిస్కౌంట్లు, ఆఫర్లు, అదనపు తగ్గింపులు పొందాలంటే HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగించాలి. ఇది కాకుండా Flipkart యాక్సిస్ బ్యాంక్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తుంది. ఇది మాత్రమే కాకుండా టీజర్ వినియోగదారులందరికీ బెస్ట్ ఎక్స్ఛేంజ్, నో-కాస్ట్ EMI ఎంపికలను అందజేస్తుందని తెలియజేస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2024లో iPhone 15 ధర భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇ కామర్స్ వెబ్‌సైట్ Moto g85, Samsung ఫోన్‌లతో పాటు Vivo ఫోన్‌లపై బంపర్ డిస్కౌంట్లను అందించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2024లో Apple వాచ్ సిరీస్ 9 ధర కూడా డ్రాప్ అవొచ్చు. Samsung Galaxy S23 FE, నథింగ్ ఫోన్‌లు కూడా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో చాలా చౌకగా లభిస్తాయి. సేల్ సమయంలో మీరు స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలపై 80 శాం వరకు తగ్గింపు పొందవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories