Moto G45 5G: అఫర్ అదిరిందిగా.. ఇప్పుడు తక్కువ ధరకే మోటో 5జీ మొబైల్..!

Flipkart Announces Huge Offeron Moto G45 5G Phone
x

Moto G45 5G: అఫర్ అదిరిందిగా.. ఇప్పుడు తక్కువ ధరకే మోటో 5జీ మొబైల్..!

Highlights

Moto G45 5G: మీరు చౌక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే.

Moto G45 5G: మీరు చౌక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఇప్పుడు Moto G45 5G ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపులతో లభిస్తుంది, ఇందులో బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు ఉన్నాయి. Moto G45 5Gలో అందుబాటులో ఉన్న డీల్స్, ఆఫర్‌ల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Moto G45 5G Offers

మోటో G45 5G ఫోన్ 8GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,999కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌ల గురించి మాట్లాడితే మీరు IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై రూ. 1500 తగ్గింపును పొందచ్చు, ఆ తర్వాత ప్రభావవంతమైన ధర రూ. 11,499 అవుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 8,950 ఆదా చేసుకోవచ్చు.

Moto G45 5G Specifications

మోటో G45 5G 720x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది గొరిల్లా గ్లాస్ ప్రొటక్షన్ కలిగి ఉంది. ఫోన్‌లో Qualcomm Snapdragon 6s Gen 3 ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14లో పనిచేస్తుంది. కనెక్టివిటీ కోసం ఇందులో బ్లూటూత్ 5.1, Wi-Fi, GPS, USB టైప్ C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. ఫోన్‌లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.

కెమెరా సెటప్ గురించి మాట్లాడితే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుక భాగంలో 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఇది ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. పెద్ద 5000mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories