Best Tablets under Rs 25000: బెస్ట్ బ్రాండెడ్ టాబ్లెట్స్.. తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్స్ 

Best Tablets under Rs 25000: బెస్ట్ బ్రాండెడ్ టాబ్లెట్స్.. తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్స్ 
x
Highlights

Best Tablets under Rs 25000 Budget: ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్రస్తుతం టాబ్లెట్స్‌పై భారీ తగ్గింపులు అందిస్తున్నాయి. ఇప్పుడు భారీ...

Best Tablets under Rs 25000 Budget: ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్రస్తుతం టాబ్లెట్స్‌పై భారీ తగ్గింపులు అందిస్తున్నాయి. ఇప్పుడు భారీ తగ్గింపుతో బ్రాండెడ్ టాబ్లెట్స్‌ను కొనుగోలు చేయొచ్చు. వీటిపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఈ జాబితాలో Poco, Honor, Xiaomi, OnePlus వంటి టాప్ కంపెనీలు ఉన్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1) Poco Pad 5G

ఇది 2,560 x 1,600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 12.1-అంగుళాల 2K డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 16:10 యాస్పెక్ట్ రేషియోకి సపోర్ట్ చేస్తుంది. ఇది డెడికేటెడ్ వ్యూ అనుభవాన్ని అందిస్తుంది. డిస్‌ప్లే గరిష్టంగా 600 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది. టీయూవీ రైన్‌ల్యాండ్ ట్రిపుల్ సర్టిఫికేషన్‌తో పాటు అదనపు ప్రొటక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో వస్తుంది.

టాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 SoC తో రన్ అవుతుంది. దీనితో పాటు 8GB వరకు RAM, 128GB వరకు UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో SD కార్డ్ ద్వారా 1.5TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే HyperOS తో నడుస్తుంది. ఈ టాబ్లెట్ ఫ్లిప్‌కార్ట్‌లో 22 శాతం తగ్గింపుతో రూ. 22,999కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ ద్వారా ఈ టాబ్లెట్‌ను కొనుగోలు చేసినట్లయితే మరో రూ.1200 డిస్కౌంట్ ఆఫర్ అందుకోవచ్చు.

2) Honor Pad 9

అమెజాన్‌లో 8GB RAM / 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999 గా ఉంది. బ్యాంక్ ఆఫర్ కింద మీరు దీనిపై రూ. 1750 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. హానర్ ప్యాడ్ 9 2560 x 1600 రిజల్యూషన్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో 12.1-అంగుళాల WQXGA TFT LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. టాబ్లెట్ Qualcomm Snapdragon 6 Gen 1 చిప్‌సెట్‌పై నడుస్తుంది. అన్ని గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌లను నిర్వహించడానికి Adreno 710 GPUతో లింక్ చేసి ఉంటుంది.

ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా Honor కంపెనీ MagicOS 7.2 పై రన్ అవుతుంది. కెమెరా ముందు భాగంలో టాబ్లెట్ 13MP వెనుక షూటర్‌తో వస్తుంది. అది 4k వరకు వీడియోలను షూట్ చేయగలదు. సెల్ఫీలు తీసుకోవడానికి వీడియో కాల్స్‌లో పాల్గొనడానికి ముందు భాగంలో 8MP కెమెరా ఉండనే ఉంది.

ఇది 8-స్పీకర్ సెటప్, 2 మైక్రోఫోన్‌లతో వస్తుంది. టాబ్లెట్ 35W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 8300mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇంకా హానర్ తన టాబ్లెట్‌ను ఉచిత అటాచ్ చేయగల కీబోర్డ్‌తో ప్యాక్ చేస్తుంది.

3) Xiaomi Pad 6

షియోమి ప్యాడ్ 6 144Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 2880x1800 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 11-అంగుళాల డిస్‌ప్లేతో ఉంటుంది. టాబ్లెట్ ప్రొటక్షన్ కోసం డిస్‌ప్లేలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 లేయర్‌తో వస్తుంది.

ఇది గరిష్టంగా 8GB RAM తో వస్తోంది. బెస్ట్ పర్‌ఫార్మెన్స్ కోసం ఆక్టా-కోర్ Qualcomm Snapdragon 870 చిప్‌సెట్ అమర్చారు. షియోమి ప్యాడ్ 6 ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై కంపెనీ MIUI 14 కస్టమ్ స్కిన్‌తో రన్ అవుతుంది.

f/2.2 ఎపర్చర్‌తో వెనుకవైపు 13MP కెమెరా ఉంది. ముందు భాగంలో టాబ్లెట్ వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 8MP కెమెరాతో వస్తుంది. నాన్-స్టాప్ పర్‌ఫార్మెన్స్ కోసం 8,840mAh బ్యాటరీని అందిస్తున్నారు. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్‌తో వస్తుంది. అమెజాన్ నుండి 40 శాతం తగ్గింపు తరువాత రూ. 24,999కి కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా మీరు బ్యాంక్ డిస్కౌంట్ కింద అదనంగా మరో రూ. 1,750 డిస్కౌంట్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories