Whatsapp Blocked: వాట్సాప్‌ లో మిమ్మల్ని బ్లాక్ చేశారా.. ఇలా సులువుగా కనిపెట్టండి..!

Find out if you have been blocked on WhatsApp easily
x

Whatsapp Blocked: వాట్సాప్‌ లో మిమ్మల్ని బ్లాక్ చేశారా.. ఇలా సులువుగా కనిపెట్టండి..!

Highlights

Whatsapp Blocked: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. అందులో వాట్సాప్‌ అనే యాప్‌ కచ్చితంగా ఉంటుంది.

Whatsapp Blocked: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. అందులో వాట్సాప్‌ అనే యాప్‌ కచ్చితంగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది వాట్సాప్ ద్వారా సమాచారం వేగంగా చేరవేస్తున్నారు. ఇందులో ఫొటోలు, వీడియోస్‌ ‌ సులువుగా పంపించవచ్చు. వాట్సాప్‌ అనేది నేటి ఆధునిక యుగంలో ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పవచ్చు. అయితే వాట్సాప్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూనే ఉంటుంది. ఒక్కోసారి దీని ద్వారా ఫ్రాడ్స్‌ కూడా జరుగుతున్నాయి. అయితే మీ వాట్సప్‌ అకౌంట్‌ను ఎవరూ బ్లాక్‌ చేశారో ఈ పద్దతి ద్వారా సులువుగా తెలుసుకోండి.

స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతున్నారు. ఇందులో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ వస్తూనే ఉంటాయి. అవన్నీ మంచి ఎక్స్పీరియన్స్ తో పాటుగా సెక్యూరిటీని అందిస్తాయి. దీంతో ఎక్కువ మంది వాట్సాప్ ను వాడడానికి మొగ్గు చూపుతున్నారు. ఫోటో పంపించాలన్న వీడియో పంపించాలన్న లేదంటే ఏమైనా డాక్యుమెంట్స్ పంపించాలన్న వాట్సాప్ ద్వారా సులువుగా, వేగంగా పంపిస్తున్నారు.

అయితే ఒక్కోసారి మనం చాలా మందికి మెసేజ్ లు పంపిస్తాం. కానీ రిప్లై రాదు. డెలివరీ అయినట్లు రెండు టిక్స్ రావు. దీంతో బ్లాక్ చేశారేమో అని అనుమానం వస్తుంది. మీరు ఎవరైనా ప్రొఫైల్ ను ఎక్కువ కాలం చూడలేకపోతే బ్లాక్ చేశారని అర్థం చేసుకోవాలి. మీరు ఎవరి స్టేటస్‌ను ఎక్కువ కాలం చూడకపోతే మిమ్మల్ని బ్లాక్ చేశారు అని భావించాలి. ప్రొఫైల్ ఫొటో కనిపించకపో తే బ్లాక్ చేసినట్లు అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి మెసేజ్ లు పంపినా సెండ్‌ కావు. ఇలాంటి సమస్యలు ఎదురైతే మీ వాట్సాప్‌ అకౌంట్‌ను వారు బ్లాక్‌ చేశారని అర్థం చేసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories