New IT Rules: ఇండియాలో ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం బ్యాన్‌?

Facebook, Twitter and Instagram to be Banned in India With New IT Rules and Penalties 2021
x

ఇండియాలో ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం బ్యాన్‌? (ఫొటో ట్విట్టర్)

Highlights

FB, Twitter & Instagram Ban in India: ఇండియాలో ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ బంద్ కానున్నాయి.

FB, Twitter & Instagram Ban in India: ఇండియాలో ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ బంద్ కానున్నాయి. ఈ మేరకు కేంద్రం తెచ్చిన కొత్త గైడ్‌లైన్స్‌తో ఈ సోషల్ మీడియా దిగ్గజాలపై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నూతన రూల్స్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ రూల్స్ మే 26 నుంచి అమల్లోకి రానున్నాయి. నూతన నిబంధనల మేరకు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫ్లాంలకు 3 నెలల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అసలేంటి ఈ రూల్స్..

కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న రూల్స్ ప్రకారం.. ప్రతి సోషల్ మీడియా కంపెనీకి ఇండియాలో అధికారులు ఉండాలే చూసుకోవాలి. అలాంటి అధికారుల పేర్లు, ఇండియాలో వారి అడ్రస్, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారాలకు మార్గం చూపించాలి. అలాగే అభ్యంతరకరమైన కంటెంట్‌ను పర్యవేక్షించడం, అలాంటి కంటెంట్‌ ను తొలగించడం వారు చేసేందుకు ఇండియాలోనే ఉండాలి. ఎక్కడో ఉండి ఇలాంటి వాటిపై త్వరగా స్పందించడం కుదరని పని. కాబట్టి వెంటనే ఇండియాలో సంబంధిత అధికారులనే నియమించుకోవాలని నియమాలలో పేర్కొంది.

గడువు ఎప్పటి వరకు..

ఈ నియామాల్లో సూచించిన విధంగా ఏర్పాట్లు చేసుకోవడానికి సోషల్ మీడియాలకు, ఓటీటీలకు ఈనెల మే 25 వరకు కేంద్రం గడువు ఇచ్చింది. అయితే ఇంతవరకు ఈ సోషల్ దిగ్గజాలు ఇలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈ గడువు నేటితో ముగిసిసోతుంది. ఈ కంపెనీలు నూతన రూల్స్‌ను అంగీకరించకపోతే వాటిపై ఇండియాలో నిషేధం తప్పదు.

నిషేధం తప్పదా..

ఇప్పటివరకు ఈ నూతన రూల్స్‌ను ఈ సోషల్ మీడియా దిగ్గజాలు అంగీకరించలేదు. కాబట్టి మనదేశంలో ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం అమలు చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. మే 26 నుంచి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లు ఇండియాలో బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్తాయన్న వార్తలు వెలువడుతున్నాయి. కాగా, ఈ కంపెనీలు 6 నెలల సమయం కావాలని కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఈ 6 నెలల గడువుకి కేంద్రం ఒప్పుకోవడం లేదంట. దీంతో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం ల సర్వీసులు నిలిచిపోవడమో.. లేదా తాత్కాలికంగా ఆగిపోవడమో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories