cVIGIL App: ఎన్నికల్లో అవినీతికి చెక్.. సీ-విజిల్ యాప్‌తో 100 నిమిషాల్లో పరిష్కారం..!

Election Commission of India launches cVigil App: All you must know
x

cVIGIL App: ఎన్నికల్లో అవినీతిని చెక్.. సీ-విజిల్ యాప్‌తో 100 నిమిషాల్లో పరిష్కారం..!

Highlights

UP Assembly Election 2022: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించింది.

UP Assembly Election 2022: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించింది. ఎన్నికల సమయంలో ప్రజలు cVIGIL యాప్‌ను ఉపయోగించాలని గతంలో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగితే ప్రజలు దీని ద్వారా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారు. ఈ యాప్‌ను కమిషన్ 3 సంవత్సరాల క్రితం 2019లో ప్రారంభించింది. ఈ యాప్ గురించి తెలుసుకుందాం.

సి-విజిల్ యాప్ అంటే ఏమిటి?

ఎన్నికల్లో అక్రమాలను నిరోధించేందుకు ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ సహాయంతో ఓటర్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చు. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌పై ఫిర్యాదు చేయడానికి, వినియోగదారు స్మార్ట్‌ఫోన్ కెమెరా, GPSకి యాక్సెస్ కలిగి ఉండాలి. ఎన్నికల సంఘం ఈ యాప్‌ను గత 3 సంవత్సరాలుగా అన్ని రకాల ఎన్నికల్లో ఉపయోగిస్తోంది.

సి-విజిల్ ఎన్నికలను పారదర్శకంగా చేస్తుంది..

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన రాష్ట్రంలోని ప్రజలు ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు.

ఎన్నికల కమిషన్ ప్రకారం, ఎన్నికల తేదీలను ప్రకటించినప్పటి నుంచి ఓటింగ్ ముగిసే వరకు, ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. సి-విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఏవైనా అక్రమాలు జరిగితే పంపించవచ్చు.

ప్రవర్తనా నియమావళి సమయంలో, నాయకుల తరపున ఎలాంటి అక్రమ పత్రాల పంపిణీ, అవినీతి, వివాదాస్పద ప్రకటనలు ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

సి-విజిల్ యాప్‌లో ఫిర్యాదుదారుడు అప్‌లోడ్ చేసిన ఏదైనా వీడియో లేదా ఫోటో 5 నిమిషాల్లో స్థానిక ఎన్నికల అధికారికి పంపిస్తారు.

ఫిర్యాదు సరైనదైతే, ఆ సమస్య 100 నిమిషాల్లో పరిష్కరిస్తారు.

మే 2019లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ యాప్ మొదటిసారి ఉపయోగించారు. అప్పటి నుంచి ఎన్నికల్లో ఈ యాప్‌ను నిరంతరంగా ఉపయోగిస్తున్నారు.

సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయడం ఎలా?

సి-విజిల్ యాప్ ద్వారా ఎవరిపైనైనా ఫిర్యాదు చేయాలనుకునే వారు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మీరు నమోదు చేసుకోవాలి. దీని కోసం, ఫిర్యాదుదారు పేరు, చిరునామా, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ, పిన్‌కోడ్ వివరాలను ఇవ్వాలి. ఇది OTP సహాయంతో ధృవీకరించబడుతుంది. ఇప్పుడు ఫిర్యాదు చేయడానికి ఫోటో లేదా కెమెరాను ఎంచుకోండి. ఫిర్యాదుదారు యాప్‌లో గరిష్టంగా 2 నిమిషాల వీడియోను అప్‌లోడ్ చేయవచ్చు. ఫోటోలు, వీడియోలకు సంబంధించిన వివరాలను కూడా టైప్ చేయవచ్చు.

ఎలక్షన్ కమీషన్ ప్రకారం, అప్‌లోడ్ చేసే ఫోటో లేదా వీడియో, ఆ స్థలం ఎక్కడుందో కూడా తెలుస్తుంది. ఫోటో లేదా వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత, వినియోగదారుకు ప్రత్యేకమైన ID వస్తుంది. దీని ద్వారా వారు మొబైల్‌లోనే ఫాలోఅప్‌ని ట్రాక్ చేయవచ్చు. ఫిర్యాదుదారుడి గుర్తింపు గోప్యంగా ఉంచుతారు. అయితే, మీరు ముందుగా రికార్డ్ చేసిన వీడియోలు లేదా ఫోటోలను యాప్‌కి అప్‌లోడ్ చేయలేరు. ఇది మాత్రమే కాదు, యాప్ నుంచి రికార్డ్ చేసిన వీడియోలు లేదా ఫోటోలు ఫోన్ గ్యాలరీలో సేవ్ చేయలేరు.

Show Full Article
Print Article
Next Story
More Stories