Echo Show 21 Price: 'ఎకోషో స్మార్ట్‌ డిస్‌ప్లే' వచ్చేసింది.. ఆల్-ఇన్‌-వన్‌గా వాడేసుకోవచ్చు..!

Echo Show 21 Launch Amazon Launches Smart Display Echo Show 21
x

Echo Show 21 Price: 'ఎకోషో స్మార్ట్‌ డిస్‌ప్లే' వచ్చేసింది.. ఆల్-ఇన్‌-వన్‌గా వాడేసుకోవచ్చు..!

Highlights

Echo Show 21 Price: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం 'అమెజాన్‌'.. సరికొత్త వాల్‌ మౌంటెడ్‌ స్మార్ట్‌ డిస్‌ప్లేను రిలీజ్ చేసింది.

Echo Show 21 Price: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం 'అమెజాన్‌'.. సరికొత్త వాల్‌ మౌంటెడ్‌ స్మార్ట్‌ డిస్‌ప్లేను రిలీజ్ చేసింది. 'ఎకో షో 21' పేరిట దీన్ని ఆవిష్కరించింది. అమెజాన్‌ నుంచి వచ్చిన అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన స్మార్ట్ డిస్‌ప్లే ఇదే. రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన ఎకోషో 15 కంటే దాదాపు రెండింతలు పరిమాణంలో ఎకో షో 21 ఉంటుంది. ఎకోషో 15కి అదనపు ఫీచర్స్ జోడించి.. పెద్ద డిస్‌ప్లేతో ఎకోషో 21ను అమెజాన్‌ లాంచ్‌ చేసింది. ఎకోషో 15, ఎకో షో 21 రెండిలో దాదాపుగా ఒకే ఫీచర్స్ ఉంటాయి.

అమెజాన్‌ నుంచి ఎకోషో 21, ఎకోషో 15ను కొనుగోలు చేయొచ్చు. ఎకోషో 15 ధర 299 డాలర్లు (రూ.25 వేలు) కాగా.. ఎకోషో 21 ధర 399 డాలర్లు (రూ.33 వేలు)గా ఉంది. ఈ స్మార్ట్‌ డిస్‌ప్లేలను భారత్‌లో లాంచ్ చేసేది లేనిది అమెజాన్‌ ఇంకా వెల్లడించలేదు. ఈ స్మార్ట్ డిస్‌ప్లేలు రిమోట్‌ సాయంతో పాటుగా అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌ కంట్రోల్ చేయొచ్చు. షాపింగ్‌ లిస్ట్‌, క్యాలెండర్‌, వెథర్ ఇన్ఫో, టు-డు లిస్ట్‌ కోసం వీటిని ఉపయోగించొచ్చు. యూట్యూబ్‌, ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ కంటెంట్‌ను కూడా ప్లే చేయొచ్చు. ఈ డిస్‌ప్లేలను ఫొటో ఫ్రేమ్‌గా కూడా వాడుకోవచ్చు.

ఇతర స్మార్ట్‌ డివైజులను ఎకోషో ద్వారా మీరు మేనేజ్‌ చేయొచ్చు. ఆడియో, వీడియో కాల్స్‌ చాల స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. మీరు బయటికి వెళ్లినపుడు ఇల్లు ఎలా ఉంది? అనే వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు ఇంట్లో ఇంట్లో పిల్లలు, పెంపుడు జంతువుల పరిస్థితిను కూడా ఆరా తీయొచ్చు. ఈ స్మార్ట్‌ డిస్‌ప్లేలను ఇంట్లో మీకు కావాల్సిన చోట అమర్చుకోవచ్చు. మొత్తంగా వీటిని ఆల్-ఇన్‌-వన్‌గా వాడేసుకోవచ్చన్న మాట.

Show Full Article
Print Article
Next Story
More Stories