Smartphone Heat: కారణం లేకుండా స్మార్ట్‌ఫోన్‌ హీట్‌ అవుతుందా.. ఈ విషయాల పట్ల నిర్లక్ష్యం వీడండి..!

Does the Smartphone Heat up for no Reason Dont Ignore These Things
x

Smartphone Heat: కారణం లేకుండా స్మార్ట్‌ఫోన్‌ హీట్‌ అవుతుందా.. ఈ విషయాల పట్ల నిర్లక్ష్యం వీడండి..!

Highlights

Smartphone Heat: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది.

Smartphone Heat: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. ఇది లేనిదే కాలు కూడా బయటపెట్టడం లేదు. శరీరంలో ఒక అవయంలా మారిపోయింది. అలాంటి ఫోన్‌ కారణం లేకుండా హీట్‌ అయితే మీరు కొన్ని విషయాలను విస్మరిస్తున్నారని అర్థం. వాస్తవానికి స్మార్ట్‌ఫోన్ వేడెక్కిందంటే దాని సర్వీస్‌ దగ్గరపడిందని అర్థం. కానీ కొన్నిసార్లు మనం చేసే తప్పుల వల్ల కూడా ఫోన్‌ వేడెక్కుతుంది. ఈ రోజు అలాంటి కొన్ని కారణాల గురించి తెలుసుకుందాం.

యాప్‌లు

కొన్ని యాప్‌లు ఫోన్ వేడెక్కడానికి కారణమవుతాయి. ముఖ్యంగా గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ లేదా గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌లను కలిగి ఉంటాయి. ఈ మయాప్‌లను తక్కువగా ఉపయోగించండి లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చేయకుండా ఆపండి. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

బ్యాటరీ

పాత లేదా దెబ్బతిన్న బ్యాటరీ ఫోన్ వేడెక్కడానికి కారణమవుతుంది. మీ ఫోన్ బ్యాటరీ 2 సంవత్సరాల కంటే పాతదై ఉంటే దాన్ని మార్చడాన్ని ప్రయత్నించండి. ఫోన్ వేడెక్కకుండా ఉండాలంటే ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు వాడవద్దు.

ఛార్జింగ్

చెడ్డ ఛార్జర్ లేదా కేబుల్ ఫోన్ వేడెక్కడానికి కారణమవుతుంది. ఎల్లప్పుడూ అసలైన ఛార్జర్, కేబుల్‌ను ఉపయోగించండి. ఫోన్ వేడెక్కకుండా నిరోధించడానికి ఛార్జింగ్ చేస్తున్నప్పుడు దానిని చల్లని ప్రదేశంలో ఉంచండి.

సాఫ్ట్‌వేర్

పాత లేదా పాడైన సాఫ్ట్‌వేర్ ఫోన్ వేడెక్కడానికి కారణమవుతుంది. ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను ఎల్లప్పుడూ అప్‌డేట్‌ చేస్తూ ఉండాలి. ఫోన్ సాఫ్ట్‌వేర్ పాడైందని మీరు భావిస్తే దాన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి.

హార్డ్‌వేర్

ఫోన్ హార్డ్‌వేర్ తప్పుగా ఉంటే అది వేడెక్కవచ్చు. ఫోన్ హార్డ్‌వేర్ పాడైపోయిందని భావిస్తే నిపుణుడి ద్వారా దాన్ని రిపేర్ చేయించాలి.

ఉపయోగ విధానం

ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తే అది వేడెక్కవచ్చు. ఫోన్ వేడెక్కకుండా నిరోధించడానికి దానిని అతిగా ఉపయోగించకండి. చల్లబరచడానికి అప్పుడప్పుడు దాన్ని ఆఫ్ చేయండి.

వైరస్

వైరస్ వల్ల ఫోన్ వేడెక్కుతుంది. వైరస్‌ల నుంచి ఫోన్‌ను రక్షించుకోవడానికి యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories